AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Loss: జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కారణాలు అవేనా.. ఏం చేయాలి?

అందమైన ఒత్తైనా, పొడవైన జుట్టు ఉండాలని అందరికీ ఉంటుంది. అయితే కొందరిలో ఈ జుట్టు బాగా పెరుగుతుంది. కానీ కొందరిలో మాత్రం పెరుగుదల నిలిచిపోతుంది. కొందరికి ఒక స్థాయి వరకు మాత్రమే జుట్టు వస్తుంది. అయితే ఉన్న ఆ జుట్టు కూడా రాలి పోతూ ఉంటే అది చాలా బాధను కలిగిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలి పోవడం వల్ల మానసిక ఎంత అందంగా ఉన్నా.. సరైన విధంగా జుట్టు లేకపోతే ఆకర్షణీయంగా కనిపించరు. సాధారణంగా ప్రతి రోజూ 50 నుంచి 100 వెంట్రుకలు ఊడి..

Hair Loss: జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కారణాలు అవేనా.. ఏం చేయాలి?
Hair Loss
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 22, 2023 | 9:00 PM

Share

అందమైన ఒత్తైనా, పొడవైన జుట్టు ఉండాలని అందరికీ ఉంటుంది. అయితే కొందరిలో ఈ జుట్టు బాగా పెరుగుతుంది. కానీ కొందరిలో మాత్రం పెరుగుదల నిలిచిపోతుంది. కొందరికి ఒక స్థాయి వరకు మాత్రమే జుట్టు వస్తుంది. అయితే ఉన్న ఆ జుట్టు కూడా రాలి పోతూ ఉంటే అది చాలా బాధను కలిగిస్తుంది. జుట్టు ఎక్కువగా రాలి పోవడం వల్ల మానసిక ఎంత అందంగా ఉన్నా.. సరైన విధంగా జుట్టు లేకపోతే ఆకర్షణీయంగా కనిపించరు. సాధారణంగా ప్రతి రోజూ 50 నుంచి 100 వెంట్రుకలు ఊడి పోతూ ఉంటాయి. మళ్లీ ఆ స్థానంలో కొత్త జుట్టు అనేది వస్తూ ఉంటుంది. కానీ అంత కంటే ఎక్కువగా ఊడితే మాత్రం అది నిజంగానే హెయిర్ ఫాల్ అని గమనించాలి.

పోషకాల కొరతతో హెయిర్ ఫాల్:

జుట్టు ఊడడం అనేది వివిధ రకాలుగా ఉంటుంది. మహిళల్లో ఒకలా ఉంటే.. పురుషుల్లో ఒకలా ఉంటుంది. జుట్టుకు కావాల్సిన పోషకాలు, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం వంటి వాటి వలన జుట్టు అనేది ఊడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో పోషకాల కొరత వలన జుట్టు అనేది బలహీనంగా, నిర్జీవంగా తయారు అవుతుంది. దీని వలన జుట్టు అనేది ఊడుతూ ఉంటుంది. మార్కెట్లో లభ్యమయ్యే వివిధ రకాల నూనెలు, షాంపూల వినియోగం వల్ల కూడా జుట్టు రాలి పోతూ ఉంటుంది. దానికి కారణం అందులో రసాయనాలు ఎక్కువగా ఉండటం.

ఇవి కూడా చదవండి

హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, ఇన్ ఫెక్షన్స్ సమస్యలు ఉంటే:

అకస్మాత్తుగా జుట్టు ఇలా రాలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. సాధారణంగా జుట్టు రాలి పోవడానికి కారణం ఆండ్రోజెనిక్ అలోపేసియా అని పిలిచే వంశపారం పర్య సమస్య అయి ఉండొచ్చు. ఇది కాకుండా హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్, ఇన్ ఫెక్షన్స్, కొన్ని హెయిర్ కేర్ విధానాలు, మెడిసిన్ ఎక్కువగా తీసుకోవడం ఇలా అనేక కారణాలు ఉంటాయి. అలాగే కొంత మంది బరువు తగ్గేందుకు డైట్ ని మెయింటైన్ చేస్తూంటారు. అలాంటి వారికి కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వారు ఇతర పోషకాలను, కేలరీలు ఎక్కువగా ఉన్న ఫుడ్ ని తీసుకోకపోవడం. ఇది అడ్జెస్ట్ చేసుకుంటే.. ఏ సమస్యలూ ఉండవు.

వైద్యులను సంప్రదించడం మేలు:

ఇదే కాకుండా జుట్టుకు కావాల్సిన.. ఐరన్, జింక్, ప్రోటీన్ వంటి పోషకాల కొరత వలన కూడా వెంట్రుకలు అనేవి నిర్జీవంగా, బలహీనంగా తయారై.. జుట్టు రాలిపోతూ ఉంటుంది. పీసీఓడీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా జుట్టు పై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే పీరియడ్స్ సక్రమంగా రాకపోయినా ఆ ప్రభావం కూడా జుట్టుపై కనిపిస్తుంది. ఇలా అనేక కారణాల వల్ల జుట్టు అనేది రాలుతూ ఉంటుంది. అయితే జుట్టు రాలే సమస్యలు మరింత ఎక్కువగా ఉంటే.. డాక్టర్ని సంప్రదించడం మేలు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?