Gas Problem Home Remedies: కడుపులో గ్యాస్ సమస్య వేధిస్తోందా? ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం..!

Gas Problem Home Remedies: అనారోగ్యకరమైన ఆహారం, సరికాని జీవనశైలి కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

Gas Problem Home Remedies: కడుపులో గ్యాస్ సమస్య వేధిస్తోందా? ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం..!
Gas Problems

Updated on: Aug 30, 2022 | 10:09 PM

Gas Problem Home Remedies: అనారోగ్యకరమైన ఆహారం, సరికాని జీవనశైలి కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సంబంధిత సమస్యలు మొదలైనవి తలెత్తుతాయి. వీటి కారణంగా చాలా అసౌకర్యంగా ఉంటుంది. అయితే, కడుపు ఉబ్బరం సమస్యను అధిగమించడానికి కొన్ని ఇంటి నివారణలు అద్భుతంగా పని చేస్తాయని ఆయుర్వేద, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిచెన్‌లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య నుంచి త్వరితగతిన ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు.. ఇవి మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాము..

వాము లేదా అజ్వైన్ తీసుకోవడం ద్వారా గ్యాస్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. గ్యాస్ వల్ల వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇది పని చేస్తుంది. ఇందుకోసం గోరువెచ్చని నీటిలో ఒక చెంచా వాము గింజలు కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇంగువ..

కడుపు ఉబ్బరం సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఇంగువ కూడా అద్భుతంగా పని చేస్తుంది. ఇంగువలో యాంటీ ఫ్లాట్యులెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది గ్యాస్ సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల పొత్తికడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఉబ్బరం సమస్య తగ్గుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఇంగువ తీసుకోవాలి. అయితే, ఆహారం తిన్న తర్వాతే దీనిని తీసుకోవాలి. అలాగే దీన్ని ఎక్కువగా తీసుకోవద్దు. లేదంటే గుండెల్లో మంట సమస్య వస్తుంది.

జీలకర్ర..

జీలకర్ర జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు జీలకర్ర నీరు త్రాగాలి. ఇది ఉబ్బరం సమస్య నుండి ఉపశమనం ఇస్తుంది. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

నిమ్మ సోడా..

నిమ్మకాయ సోడా తీసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం, బేకింగ్ పౌడర్ కలిపి తీసుకోవాలి. ఇది గ్యాస్ సమస్య నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. ఎక్కువ భోజనం తిన్న తరువాత జీర్ణక్రియకు ఇది సహాయపడుతుంది.

త్రిఫల..

త్రిఫల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ త్రిఫల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. త్రిఫల చూర్ణం తినడం జీర్ణక్రియకు సంబంధించిన సమస్యల నుండి బయటపడతారు. ఇది కాకుండా, పుదీనా టీని కూడా తీసుకోవచ్చు. అదే సమయంలో, అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం మానుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

( ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా ఉంది. TV9 హిందీ వాటిని ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి .)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..