AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cancer Day: ఆహారంతో క్యాన్సర్‌ మహమ్మారికి అడ్డుకట్టవేయొచ్చని మీకు తెలుసా..? వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే..

Food Reduce Cancer Risk: క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడి ఏటా వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇటీవల క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జీవన శైలి మారుతుండడం, తీసుకునే ఆహారంలో మార్పులు వస్తుండడంతో..

Cancer Day: ఆహారంతో క్యాన్సర్‌ మహమ్మారికి అడ్డుకట్టవేయొచ్చని మీకు తెలుసా..? వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే..
Narender Vaitla
|

Updated on: Feb 04, 2021 | 5:53 AM

Share

Food Reduce Cancer Risk: క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడి ఏటా వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇటీవల క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జీవన శైలి మారుతుండడం, తీసుకునే ఆహారంలో మార్పులు వస్తుండడంతో క్యాన్సర్‌ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే క్యాన్సర్‌ వచ్చాక ఎలాగో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటాం. అలా కాకుండా అసలు క్యాన్సర్‌ మహమ్మారిని మన దరికి చేరకుండా చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ.! మనం తీసుకునే ఆహారం భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్‌కు చెక్‌ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. నేడు (ఫిబ్రవరి4) ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే క్యాన్సర్‌ రాకుండా అడ్డుకట్టవేయవచ్చో ఓసారి చూద్దాం…

* క్యాన్సర్‌ కణాలను నాశనం చేయడంలో అల్లం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అండాశయ క్యాన్సర్‌ పెరగకుండా నిరోధిస్తుంది.

* యాపిల్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజూ ఒక యాపిల్‌ తీసుకుంటే.. రొమ్ము, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లకు చెక్‌ పెట్టవచ్చు.

* రొమ్ము క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో దానిమ్మ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పాలీఫినాల్‌ క్యాన్సర్‌ పెరగకుండా చూస్తుంది.

* రొమ్ము, పేగు, చర్మ సంబంధిత క్యాన్సర్‌ కణాలను నాశనం చేయడంలో పసుపు క్రీయాశీలకంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* క్యాన్సర్‌ను అడ్డుకోవడంలో క్యారెట్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు క్యారెట్‌ అడ్డుకట్ట వేస్తుంది.

* ద్రాక్షలోని ఎలాజిక్‌ యాసిడ్‌ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ రాకుండా చూస్తుంది.

* జిలకర్రలో ఉండే ఫైటోకెమికల్‌ క్యుమినాల్డిహైడ్‌ క్యాన్సర్‌ వ్యాధిని నియంత్రించడంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో యాంటి యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

* గ్రీన్‌టీ ద్వారా కేవలం బరువు తగ్గడమే కాకుండా క్యాన్సర్‌ను తగ్గిస్తుంది. గ్రీన్‌టీ అన్ని రకాల క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

Also Read: Mint Leaves: ఆరోగ్యంతో పాటు అందం… పుదీనాతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..