Health Tips: మామిడిపండ్లు తినేముందు ఈ పద్దతి పాటించండి.. ఎటువంటి వేడి ఉండదు..!

|

May 13, 2022 | 6:17 AM

Health Tips: వేసవి కాలంలో మామిడి పండ్లని అందరు ఇష్టపడుతారు. పిల్లలు మరీ ఎక్కువగా తింటారు. అంతేకాదు మామిడితో చాలా వంటకాలను కూడా తయారు చేస్తారు.

Health Tips: మామిడిపండ్లు తినేముందు ఈ పద్దతి పాటించండి.. ఎటువంటి వేడి ఉండదు..!
Mangoes
Follow us on

Health Tips: వేసవి కాలంలో మామిడి పండ్లని అందరు ఇష్టపడుతారు. పిల్లలు మరీ ఎక్కువగా తింటారు. అంతేకాదు మామిడితో చాలా వంటకాలను కూడా తయారు చేస్తారు. రాత్రి భోజనం చేశాక మామిడికాయ తింటే చాలా మంచిది. వాస్తవానికి మామిడిపండ్లు ఒక పద్దతి ప్రకారం తినాలి. ఇంట్లో అమ్మమ్మ, తాతయ్యలు ఉంటే మామిడికాయలను తినడానికి ముందు వాటిని నీటిలో నానబెట్టమని సలహా ఇస్తారు. ఇది వారు ఊరికే చెప్పలేదు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మామిడిపండును సరిగ్గా తింటే అది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మామిడి పండ్లని నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

మామిడి పండ్లని ఎక్కువగా రసాయనాలలో ఉంచుతారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే తినేటప్పుడు మామిడికాయ వేడిగా ఉంటే అది శరీరానికి మంచిది కాదు. దీని వల్ల ఆరోగ్యమే కాదు చర్మ సమస్యలు తలెత్తుతాయి. మామిడిపండ్లపై ఉండే ఫైటిక్ యాసిడ్, వేడిని తొలగించాలంటే ముందుగా వాటిని ఒక గిన్నెలో చల్లటి నీరు పోసి నానబెట్టాలి. మామిడిలో ఉండే ఫైటిక్ యాసిడ్ ఐరన్, జింక్, కాల్షియం, ఇతర మినరల్స్ వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తుంది. ఇది ఖనిజాల లోపానికి దారితీస్తుంది. మీరు మామిడిని నానబెట్టినప్పుడు శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే అదనపు ఫైటిక్ యాసిడ్‌ తొలగిపోతుంది.

మామిడికాయలో ఉండే వేడి వల్ల అనేక చర్మ వ్యాధులు సంభవిస్తాయి. వాటిని నీళ్లలో నానబెట్టడం వల్ల దాని వేడి మొత్తం తొలగిపోతుంది. అలాగే ఫైటిక్ యాసిడ్ కూడా తొలగిపోతుంది. మామిడికాయలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. వాటిని కాసేపు నీటిలో నానబెట్టడం వల్ల థర్మోజెనిక్ లక్షణాలు తగ్గిపోతాయి. మామిడి పండ్లను సరైన సమయంలో, సరైన పద్ధతిలో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మామిడిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయం పూట తినవచ్చు. మధ్యాహ్న భోజనంలో తినవచ్చు. ఈ సమయంలో మామిడిపండు తింటే కడుపు నిండిన భావన ఉంటుంది. దీనివల్ల బరువు కూడా తగ్గుతారు.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Karate Kalyani youtuber: కరాటే కల్యాణి, యూట్యూబర్‌ మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు దాడి..

K.A. Paul: కేంద్ర హోం మంత్రిని కలిసిన కేఏ పాల్.. జడ్ ప్లస్ సెక్యూరిటీ కేటాయించాలని వినతి..

Sambar: సాంబార్ రుచిగా ఉండాలంటే ఏం చేయాలి.. ఇంట్లో ఇలా తయారు చేసి చూడండి..!