Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fingernails: మీ చేతిగోళ్లలో దీనిని చూసి ఆనారోగ్య సమస్యలను గుర్తించవచ్చు.. ఏ రంగు మారితే ఎలాంటి వ్యాధులు వస్తాయి!

Fingernails: సాధారణంగా ఏదైనా ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవాలంటే రక్త పరీక్షలు చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ఇక ఇది సర్వసాధారణమైన విషయమే. కొందరు..

Fingernails: మీ చేతిగోళ్లలో దీనిని చూసి ఆనారోగ్య సమస్యలను గుర్తించవచ్చు.. ఏ రంగు మారితే ఎలాంటి వ్యాధులు వస్తాయి!
Fingernails
Follow us
Subhash Goud

|

Updated on: Nov 22, 2021 | 10:21 AM

Fingernails: సాధారణంగా ఏదైనా ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవాలంటే రక్త పరీక్షలు చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ఇక ఇది సర్వసాధారణమైన విషయమే. కొందరు నిపుణులు వైద్య పరీక్షలు లేకుండానే శరీరంలో తలెత్తే అనారోగ్య సమస్యలను సులభంగా గుర్తించవచ్చని చెబుతుంటారు. అయితే ఇలాంటి చిట్కాలను ఎక్కువమంది నమ్మకుండా కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని చిట్కాలు మాత్రం ఎంతో సులభంగా తమలోని ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి మనిషి చేతివేళ్ల గోళ్ల ద్వారానే వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు. కొందరి గోళ్లు శుభ్రంగా మృదువుగా, మరి కొందరి గోళ్లు కాస్త భిన్నంగా ఉంటాయి.

చేతిగోళ్లపై అర్ధచంద్రాకారం

సాధారణంగా ప్రతి ఒక్కరి చేతివేళ్లపై అర్ధచంద్రాకారంలో ఒక గుర్తు ఉంటుంది. ఈ ఆకారంలో ఉండే సెమీ సర్కిల్‌లు ‘లునులా’ అంటారు. అయితే ఈ లునులా ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన ఆరోగ్య సమస్యలను అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఒకవేళ లునులా దెబ్బతింటే గోర్లు పెరగడం కూడా అక్కడితో ఆగిపోతుందని పేర్కొంటున్నారు. నిపుణులు. కేవలం చేతి వేళ్ళ గోర్లు చూసి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చా..? ఇది నిజంగా నిజమేనా అనే అందరికీ అనుమానం రాకమానదు. ఇంతకీ చేతివేలి గోళ్లపై ఉండే లునులా ద్వారా ఆరోగ్య సమస్యలను ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం.

ఒకవేళ చేతివేళ్లపై ఉన్న ‘లునులా’ (అర్ధచంద్రాకారం) లేకపోతే రక్తహీనత.. పౌష్టికాహార లోపం అని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఒకవేళ లునులాపై ఎరుపు, పసుపు పచ్చ రంగులు ఉంటే గుండె సమస్యలు వస్తాయని అర్థం చేసుకోవాలట. అలాగే మరీ చిన్నగా ఉంటే కనుక శరీరంలో విషపదార్థాలు పెరిగిపోతున్నాయని అర్థం చేసుకోవాలట. ఒకవేళ లునులా నీలి రంగులో ఉంటే త్వరలో డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. గోళ్లు తెల్లగా ఉంటే మంచిదంటున్నారు. అలాగే మీ గోళ్లు తెల్లగా లేకపోయినా.. గోళ్లపై లునులా లేకపోతే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే లూనులా ఎర్రగా మారినట్లయితే గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సంకేతం. గోధుమ రంగు మారినట్లయితే మూత్రపిండాల వ్యాధులకు సంకేతం.

ఏ రంగు మారితే ఎలాంటి వ్యాధులు:

► లేత నీరం రంగు మారితే – మధుమేహం ► గోధుమ రంగు మారితే – ఫ్లోరైడ్‌ సమస్య ► ఎరుపు రంగు మారితే – గుండె సంబంధిత ► ఎరుపు, తెలుపు రంగులో మారితే మూత్ర పిండాల సమస్యలు ► నీలం రంగు మారితే – ఇతర వ్యాధులు ► పసుపు రంగు మారితే -టెట్రాసైక్లిన్‌ థెరఫి

ఇవి కూడా చదవండి:

Onions Benefits: ప్రతి రోజూ ఉల్లిపాయ తింటే ఏమవుతుంది..? పరిశోధనలలో కీలక విషయాలు వెల్లడి..!

Camels: ఒంటెలు నీరు తాగకుండా ఎలా ఉండగలుగుతాయి.. వాటి కనురెప్పల ప్రత్యేకత ఏమిటి? .. ఎన్నో ఆసక్తికర విషయాలు?

Climate Change: పక్షుల రెక్కలు పెరగడం.. తగ్గడంపై వాతావరణ మార్పుల ప్రభావం.. పరిశోధనలలో సంచలన విషయాలు