Eyecare Tips: టీవీ, మొబైల్ ను ఎక్కువగా చూస్తున్నారా.. ఈ లక్షణలు కనిపిస్తే నిర్లక్షం వద్దు.. కంటి చూపు జాగ్రత్త సుమా..

|

Oct 13, 2024 | 12:12 PM

గత కొన్నేళ్ళ క్రితం వరకూ కళ్లద్దాలను వృద్ధాప్యంలో పెట్టుకునే వారు. ఇప్పుడు పరిస్తితులు మారాయి.. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా చిన్న వయసులోనే కళ్లద్దాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గత కొన్ని సంవత్సరాలలో సమీప దృష్టిలోపం అంటే మయోపియా కేసులు గణనీయంగా పెరిగాయి. 2050 నాటికి జనాభాలో దాదాపు సగం మంది ఈ సమస్యతో బాధపడుతారని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Eyecare Tips: టీవీ, మొబైల్ ను ఎక్కువగా చూస్తున్నారా.. ఈ లక్షణలు కనిపిస్తే నిర్లక్షం వద్దు.. కంటి చూపు జాగ్రత్త సుమా..
Eyecare Tips
Image Credit source: BSIP/Collection Mix: Subjects/Getty Images
Follow us on

గంటల తరబడి మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ స్క్రీన్‌ల ముందు గడపడం వల్ల చిన్నారులు, యువత దగ్గర చూపు బలహీనంగా మారి ప్రస్తుతం ఈ సమస్య మహమ్మారి స్థాయికి చేరింది. ఈ అలవాటు తమ కంటి చూపును ఎలా దూరం చేస్తుందో ప్రజలకు తెలియడం లేదు. గత కొన్నేళ్ళ క్రితం వరకూ కళ్లద్దాలను వృద్ధాప్యంలో పెట్టుకునే వారు. ఇప్పుడు పరిస్తితులు మారాయి.. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా చిన్న వయసులోనే కళ్లద్దాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గత కొన్ని సంవత్సరాలలో సమీప దృష్టిలోపం అంటే మయోపియా కేసులు గణనీయంగా పెరిగాయి. 2050 నాటికి జనాభాలో దాదాపు సగం మంది ఈ సమస్యతో బాధపడుతారని కూడా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మయోపియా అంటే ఏమిటి

దగ్గరి దృష్టి సరిగ్గా లేకపోవడాన్ని వైద్య పరిభాషలో మయోపియా అంటారు. సమీప చూపు లేదా మయోపియా అనేది ఒక రకమైన హ్రస్వదృష్టి. సమీపంలోని వస్తువులను స్పష్టంగా చూడగలుగుతారు. అయితే దూరంగా ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపిస్తాయి. ఒక అధ్యయనాల అంచనా ప్రకారం దేశ జనాభాలో 20-30 శాతం మంది మయోపియాతో బాధపడుతున్నారు. మయోపియా సమస్య పెరిగినప్పుడు కంటిశుక్లం లేదా గ్లాకోమా ప్రమాదం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మయోపియాకు గల కారణం

నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ హర్షా సక్సేనా ఈ మయోపియా గురించి మాట్లాడుతూ.. దీనికి అనేక కారణాలు ఉన్నాయని ఇందులో జన్యుపరమైన, పర్యావరణ కారకాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఎవరి కుటుంబంలోనైనా మయోపియా చరిత్ర ఉన్నట్లయితే ఇతర వ్యక్తుల కంటే వీరికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఆధునిక జీవనశైలి, ఇండోర్ కార్యకలాపాలు మయోపియాను పెంచుతున్నాయి.

మయోపియా విషయంలో ఏమి చేయాలి

గ్లాసెస్ లేదా కాంటాక్ట్ లెన్స్‌లు మయోపియా లక్షణాలు పెరగకుండా నిరోధిస్తాయి. ప్రత్యేకంగా రూపొందించిన గ్లాసులలో ఒక ప్రత్యేక రకం ఆప్టికల్ లెన్స్ ఉపయోగించబడుతుంది. ఇవి మయోపియా పెరగకుండా నిరోధిస్తుంది. అంతేకాదు అనేక కంటి చుక్కలు పిల్లలలో మయోపియా పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి.

మయోపియా నివారణ

  1. జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా హ్రస్వదృష్టి కూడా పెరగకుండా నిరోధించవచ్చు
  2. బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనేలా పిల్లలను ప్రోత్సహించండి. బయట ఎక్కువ సమయం గడిపే పిల్లలకు మయోపియా వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల పిల్లలను ఇండోర్ కార్యకలాపాలకు బదులు బయట ఆడుకునేలా ప్రోత్సహించండి. పిల్లలు ప్రతిరోజూ కనీసం రెండు గంటల పాటు బయట ఆడుకునేలా చేయండి.
  3. పిల్లల స్క్రీన్ చూసే సమయాన్ని పరిమితం చేయండి. ఇప్పటి పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్‌కు కనెక్ట్ అయి ఉంటున్నారు. దీంతో కంటి సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో పిల్లలకు ఫోన్ లేదా టీవీ చూసే సమయాన్ని పరిమితం చేయండి.
  4. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం 2 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు స్క్రీన్ సమయాన్ని రోజుకు ఒక గంటకు పరిమితం చేయండి. అయితే 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు స్క్రీన్ సమయాన్ని పూర్తిగా నివారించండి. పిల్లలతో 20-20-20 నియమాన్ని కూడా అనుసరించండి. ఇందులో ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడమని సూచించండి.
  5. పిల్లలకు ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు కూడా చేయించాలి. ఇది వారి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది.

 

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..