Health: షవర్ తో స్నానం చేస్తున్నారా.. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది.. జాగ్రత్త

|

Jul 29, 2022 | 7:23 PM

ప్రస్తుత కాలంతో హార్ట్ (Heart Problems) సమస్యలు ఎక్కువవుతున్నాయి. మారిపోయిన ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం, జీవనవిధానంలో వచ్చిన మార్పులు ఇవన్నీ కలిసి గుండె ఆరోగ్యానికి శరాఘాతంగా మారాయి. గుండెకు రక్తం సరఫరా చేసే...

Health: షవర్ తో స్నానం చేస్తున్నారా.. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది.. జాగ్రత్త
Bathing
Follow us on

ప్రస్తుత కాలంతో హార్ట్ (Heart Problems) సమస్యలు ఎక్కువవుతున్నాయి. మారిపోయిన ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయామం లేకపోవడం, జీవనవిధానంలో వచ్చిన మార్పులు ఇవన్నీ కలిసి గుండె ఆరోగ్యానికి శరాఘాతంగా మారాయి. గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో పూడిక పేరుకుపోవడం, బ్లాకులు ఏర్పడటం వంటి సమస్యలతో గుండె పోటు వస్తోంది. అయితే.. కొన్ని సార్లు షవర్‌ కారణంగానూ హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చల్లటి నీటితో (Cold Water Bath) స్నానం చేస్తే ఈ ముప్పు అధికంగా ఉంటుందని చెబుతున్నారు. గుండె సమస్యలతో బాధపడేవారు చల్లటి నీటితో స్నానం చేస్తే గుండె కొట్టుకునే వేగంలో తేడాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చల్లని నీరు శరీరానికి షాక్‌ ఇస్తుందని, దీంతో చర్మంలోని రక్తనాళాలు సంకోచించి, రక్తప్రసరణ మందగిస్తుందని పేర్కొంటున్నారు. బ్లడ్ సర్క్యులేట్ స్లో అవడంతో శరీర భాగాలకు రక్తం అందించేందుకు గుండె వేగంగా పని చేయాల్సి వస్తుంది. దీంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది.

అందుకే షవర్‌ తో స్నాం చేస్తే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. వేడి వాతావరణం ఉన్న సమయంలో చన్నీటి స్నానం చేస్తే ఈ ప్రమాదం మరింత పెరుగుతుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా.. చల్లటి నీటిలో సడన్‌గా మునిగితే శరీరానికి హాని జరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. కాల్వలు, బావులు, చెరువుల్లో ఈత కొట్టేటప్పుడు కోల్డ్ షాక్ కు గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీటితో స్నానం చేయడానికి బకెట్ ఉపయోగించడం మంచిది. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. స్నానాన్ని ప్రారంభించాలి. అంతే గానీ ఒకేసారి తలపై గాని, శరీరంపై గానీ చల్లని నీళ్లు పోసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం