Health tips: బ్రేక్ ఫాస్ట్ (Breakfast) ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో.. మార్నింగ్ టిఫిన్ చేయడం మానేస్తే అంతకన్నా ఎక్కువ సమస్యలే వస్తాయి. అందుకే అల్పాహారాన్ని ఎప్పుడూ మానేయకూడదని, ఇది భవిష్యత్ లో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయని ఎక్కువగా లాగించేస్తే ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రాత్రి భోజనం (Dineer) చేసిన తర్వాత సాధారణంగా మనం నిద్రపోతాం. అలా ఉదయం వరకు ఏమీ తినకుండా దాదాపు 8గంటలు ఉంటాం. అందుకే ఉదయం లేచాక మనకు మత్తుగా, నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా ముఖ్యం. అలా అని అధిక కేలరీలుండే ఆహారాన్ని తీసుకోవద్దు. ఇలా చేస్తే బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఇది పొట్ట పెరగడానికి దోహదం చేస్తుంది. కాబట్టి తక్కువ సమయంలోనే పొట్ట వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక మనం చేసే చిన్నచిన్న తప్పిదాల వల్ల ఈ సమస్య వస్తే మాత్రం అది ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదని గుర్తించాలి.
సాధారణంగా పండ్లను నేరుగా తీసుకోకుండా కొందరు జ్యూస్ లు చేసుకుని తాగుతారు. ఇది మంచి ఆరోగ్య అలవాటే. కానీ జ్యూస్ చేసుకునేటప్పుడు అందులో షుగర్ కలవపవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఫ్రిజ్ లో ఉంచిన ప్యాకేజ్డ్ డ్రింక్ లు తాగవద్దని, ఇది పొట్టపెరగడానికి దోహదం చేస్తాయని చెబుతున్నారు. అతిగా శుద్ధి చేసిన మైదా వంటి పిండితో చేసిన ఆహారాలను బ్రేక్ ఫాస్ట్ లో అస్సలు తినవద్దు. ఇందులో పోషకాలు ఉండకపోగా.. చెడు కొవ్వులను పెంచేస్తాయి. బ్రేక్‌ఫాస్ట్ లో వేపుళ్లు, డీప్ ఫ్రై ఆహారాలు తినకూడదు. ఎందుకంటే వాటిలో ఫ్యాట్లు నడుము కొవ్వును పెంచుతుంది.
(నోట్..ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.)