Tomato: టమోటాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా.. ఆ లాభాలేంటో మీకు తెలుసా..

ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే కూరగాయల్లో టమోటాలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. చేసే ప్రతి కూరల్లో టమాటా యాడ్ చేయనిదే వంట పూర్తవదు. వాస్తవానికి టమోటాలు పండ్లు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే...

Tomato: టమోటాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా.. ఆ లాభాలేంటో మీకు తెలుసా..
Tomato Price

Updated on: Nov 13, 2022 | 12:46 PM

ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే కూరగాయల్లో టమోటాలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. చేసే ప్రతి కూరల్లో టమాటా యాడ్ చేయనిదే వంట పూర్తవదు. వాస్తవానికి టమోటాలు పండ్లు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దక్షిణ, మధ్య అమెరికాకు చెందిన టమోటాలు నైట్‌షేడ్ కుటుంబానికి చెందినవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో ఉండే పోషక విలువలు శరీరానికి బలాన్ని అందిస్తాయి. శాస్త్రీయంగా చూస్తే టమోటా పండు అయినప్పటికీ దీనిని సాధారణంగా కూరగాయ మాదిరిగా విస్తృతంగా ఉపయోగిస్తారు. యూరోపియన్లు టమోటాలను చూసినప్పుడు విషపూరిత బెర్రీగా భావించారు. అయితే టొమాటోను ప్రపంచానికి పరిచయం చేసింది స్పానిష్ వారు. నేడు, భారతదేశం టమోటాల ఉత్పత్తిలో అతి పెద్దదిగా అవతరించింది. టమోటాలు ఎక్కువగా ఎరుపు రంగులో ఉంటుంది. కాలాలు, ప్రాంతాలను బట్టి రంగుల్లో వివిధ రకాలు ఉన్న టమోటాలు కూడా మార్కెట్లో అందుబాటులో వస్తున్నాయి. టమోటాలు ఎలాంటి ఆరోగ్యక ప్రయోజనాలు అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముకలకు ఆరోగ్యకరం.. టమోటాల్లో ఉండే విటమిన్ కె, కాల్షియం ఎముకలకు బలాన్ని అందిస్తాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం వంద గ్రాముల టమోటాలలో 110 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. దీనిని బట్టి శరీర అవసరాలకు తగినంత కాల్షియం పొందేందుకు టమోటాలను తినాల్సిన అవసరం ఉంది.

షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది.. టొమాటోలలో క్రోమియం అనే ఖనిజం ఉంది. మినరల్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. మధుమేహం లేదా కుటుంబంలో దాని చరిత్ర ఉన్న వ్యక్తులు పండును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఫ్రీ రాడికిల్స్ ను తగ్గిస్తాయి.. టమోటాలు విటమిన్ ఏ, విటమిన్ సీ లకు మూలం. ఇవి రక్తంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను వదిలించుకోవడానికి సహాయపడతాయి. విటమిన్ సీ ను వ్యవస్థలోకి శోషించడానికి పచ్చి టమోటాలు మంచివి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. విటమిన్ సీ ఎక్కువగా ఉండటం వల్ల టొమాటోలు రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలనూ నియంత్రిస్తుంది. శరీరం శక్తివంతంగానూ, ఆరోగ్యంగా ఉండేలా చేసేందుకు సహాయపడుతుంది.

చర్మం మరియు జుట్టుకు మంచిది.. పెరుగుతున్న కాలుష్యం కారణంగా చర్మం, జుట్టు పాడవుతుంటాయి. కాబట్టి రెగ్యులర్ డైట్‌లో టొమాటోలను చేర్చుకోవడం వల్ల మంచి లాభం ఉంటుంది. ఇందులోని లైకోపీన్ చర్మానికి, జుట్టుకు మునుపటి మెరుపును అందిస్తుంది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం..

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..