Guava Health: పింక్ జామ మంచిదా.. వైట్ జామ మంచిదా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా

|

Sep 22, 2022 | 9:51 PM

మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే.. డైట్ లో పండ్లను చేర్చుకోవడం తప్పనిసరి. ఒక్కొక్క పండు ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సీజనల్ గా లభించేవి కొన్నైతే.. సీజన్ తో సంబంధం...

Guava Health: పింక్ జామ మంచిదా.. వైట్ జామ మంచిదా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా
Guava Leaves
Follow us on

మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే.. డైట్ లో పండ్లను చేర్చుకోవడం తప్పనిసరి. ఒక్కొక్క పండు ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సీజనల్ గా లభించేవి కొన్నైతే.. సీజన్ తో సంబంధం లేకుండా దొరికేవి మరికొన్ని. వీటిలో జామపండు ముందు వరసలో ఉంటుంది. జామ.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇంటి పెరట్లో ఎంతో ఇష్టంగా పెంచుకునే ఈ చెట్టు ఇచ్చే పండ్లంటే చిన్నపిల్లలకే కాకుండా పెద్దలకూ ఇష్టమే. ఆకుపచ్చ రంగులో ఉండి నోరూరించే ఈ పండులో అనేక రకాలు ఉన్నాయి. తియ్యగా ఉండే వీటి గుజ్జు గులాబీ, తెలుపు రంగుల్లో ఉంటుంది. అయితే చాలా మందికి జామపండు తినేటప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి. తెలుపు గుజ్జు ఉండే జామ మంచిదా..లేక గులాబీ రంగు గుజ్జు ఉండే జామ మంచిదా అనే సందేహాలు వ్యక్తమవుతుంటాయి. వీటికి నిపుణులు పలు ఆసక్తికర సమాధానాలు వెల్లడించారు. సాధారణంగా జామ.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఋతుస్రావం వల్ల కలిగే నొప్పిని నివారిస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

వీటితో పాటు జామపండ్లలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి మూలకాలు అధికంగా ఉంటాయి. డైటరీ ఫైబర్ అధికంగా లభిస్తుంది. పింక్ జామలో ఎక్కువ నీటి శాతం, తక్కువ చక్కెర, తక్కువ పిండి పదార్ధాలు, విటమిన్ సీ, ఉన్నాయి. తెల్ల జామలో ఎక్కువ చక్కెర, స్టార్చ్, విటమిన్ సీ, ఎక్కువ గింజలు ఉంటాయి. తెల్ల గుజ్జు జామలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, కానీ ఎరుపు రంగులో ఉండే జామకాయలో ఇంకా ఎక్కువ శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

పింక్ జామలో సహజంగా లభించే కెరోటినాయిడ్ పదార్థం ఉంటుంది. పింక్ జామపండ్లను సూపర్ ఫ్రూట్స్ గా పిలుస్తారు. వీటిలో విటమిన్లు ఏ, సీ, ఒమేగా 3, ఒమేగా 6 అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. జామపండును కొనుగోలు చేసేటప్పుడు దాని నాణ్యతను పరిశీలించాలి. జామలో గట్టి జామ, పచ్చి జామ, దేశి జామ మొదలైన అనేక రకాల కల్తీలు జరుగుతుంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

తాజా హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..