Pepper Health: జస్ట్ స్మాల్ ఛేంజ్.. కారం బదులుగా మిరియాల పొడిని వాడి చూడండి.. రిజల్ట్ మీకే తెలుస్తుంది..

మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా వ్యాధుల ముప్పు రోజురోజుకు పెరిగిపోతోంది. తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పులతో ఈ సమస్య మరింత అధికమైంది. కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు తలకిందులు అయిపోయాయి....

Pepper Health: జస్ట్ స్మాల్ ఛేంజ్.. కారం బదులుగా మిరియాల పొడిని వాడి చూడండి.. రిజల్ట్ మీకే తెలుస్తుంది..
Pepper Health

Updated on: Feb 24, 2023 | 6:00 PM

మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా వ్యాధుల ముప్పు రోజురోజుకు పెరిగిపోతోంది. తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పులతో ఈ సమస్య మరింత అధికమైంది. కరోనా వచ్చిన తర్వాత పరిస్థితులు తలకిందులు అయిపోయాయి. వ్యాధి ముప్పు తగ్గిపోయినా.. ఆరోగ్యంపై అవగాహన ఏర్పడింది. తనను తాను రక్షించుకోవడమే కాకుండా.. కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. చాలా కాలంగా మన వంటల్లో మసాలాలు అగ్రస్థానాన్ని ఆక్రమించాయి. వీటిలోని ఆయుర్వేద సమ్మేళనాలు వ్యాధుల బారి నుంచి కాపాడుతున్నాయి. లవంగాలు, నల్ల మిరియాలు, దాల్చినచెక్క, జీలకర్ర, యాలకులు భారతీయ గృహాల్లో సాధారణంగా కనిపించే అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కీలకమైన పదార్థాలు. మీ ఆహారంలో నల్ల మిరియాలు ఎలా చేర్చుకోవాలో. రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో, సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలు చేర్చడం చాలా సులభం. టీ, కాఫీ, ఇతర వేడి పానీయాల రుచి పెంచేందుకు నల్ల మిరియాలు ఉపయోగపడతాయి. భారతీయ ఇళ్లల్లో కారం కోసం పచ్చిమిర్చి, కారం ఉపయోగిస్తుంటారు. అలాంటప్పుడు వాటి స్థానంలో నల్ల మిరియాలు ఉపయోగించడం ప్రయోజనకరం. సలాడ్‌లు, సూప్‌ల లో మిరియాల పొడి కలుపుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. టీ తయారుచేసేటప్పుడు వాటిని వేడినీటిలో చేర్చడం మీ రోజువారీ ఆహారంలో చేర్చడానికి మరొక అద్భుతమైన మార్గం. శ్వాసకోశ వ్యవస్థపై మంచి పనితీరును కనబరుస్తుంది.

నల్లమిరియాలను పసుపుతో కలిపి తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి సమస్యను నివారించవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. పసుపు, ఎండు మిరియాల పౌడర్లను పాలలో కలిపి తీసుకోవచ్చు. నల్ల మిరియాలు కొవ్వును నియంత్రించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నల్ల మిరియాల లో మెటబాలిజం బూస్టర్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైటో న్యూట్రియంట్లు మన శరీరంలో ఉండే కొవ్వును సైతం కరిగిస్తాయి. ఈ నల్ల మిరియాల కు జోడిగా చిటికెడు కారం పొడిని చేర్చితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి