Neem Oil: చర్మ సమస్యలతో ఇబ్బందులా.. వేప నూనెతో ఇలా చేశారంటే.. రిజల్ట్ మామూలుగా ఉండదు..

వేప చెట్టుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలోనే కాకుండా మందుల తయారీలో వేపను విరివిగా ఉపయోగిస్తుంటారు. వేప వేరు నుంచి ఆకుల వరకు చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగపడేవే....

Neem Oil: చర్మ సమస్యలతో ఇబ్బందులా.. వేప నూనెతో ఇలా చేశారంటే.. రిజల్ట్ మామూలుగా ఉండదు..
Neem Oil
Follow us

|

Updated on: Dec 26, 2022 | 1:54 PM

వేప చెట్టుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలోనే కాకుండా మందుల తయారీలో వేపను విరివిగా ఉపయోగిస్తుంటారు. వేప వేరు నుంచి ఆకుల వరకు చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగపడేవే. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వేప గింజల నుంచి తీసిన నూనె గురించి. వేపనూనెకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం. చర్మ, జుట్టు సంబంధిత వ్యాధుల నివారణకు వేప నూనె అద్భుతంగా పని చేస్తుంది. వేప నూనె దంతాల సమస్యలను తొలగిస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. దంతంలోని పిప్పళ్ళు, క్రిములు, నోటి దుర్వాసన, పంటి నొప్పి సమస్యలను తగ్గిస్తుంది. మలేరియాను నివారించడానికి వేప నూనెను ఉపయోగిస్తారు. వేప నూనె మలేరియాను వ్యాప్తి చేసే దోమల నుంచి కాపాడుతుంది. వేప నూనెను అనేక పురుగుమందులలో ఉపయోగిస్తారు. వేప నూనెను చర్మానికి రాసుకునే నిద్రిస్తే దోమలు కుట్టవు.

వేప నూనెలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఇందులో ఉండే క్రిమినాశక ఇతర లక్షణాల కారణంగా ఇది ఇంటిలోకి క్రిమికీటకాలను రాకుండా కాపాడుతుంది. ఒక చిన్న గిన్నెలో వేప నూనె వేసి ఉంచితే ఇంటిలోకి క్రిమికీటకాలు రావు. వివిధ రకాల ఆయుర్వేద మందుల తయారీలో వేపను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చర్మ సమస్యలైన మొటిమలు, సోరియాసిస్, తామర, హెర్పెస్ వంటి వాటిని నయం చేసేందుకు ఉపయోగిస్తారు. చర్మం తేమ తక్కువగా ఉన్నప్పుడు తెల్లగా పొడిబారినట్లు అవుతుంది. అటువంటి పరిస్థితిలో చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. పొడి చర్మం సమస్యను అధిగమించడానికి వేప నూనెను ఉపయోగించవచ్చు. అదనంగా ఇందులో ఉండే విటమిన్-ఇ, అమైనో ఆమ్లాలు మరియు కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

అర టీస్పూన్ ఆలివ్ నూనెలో 8 నుంచి 10 చుక్కల వేపనూనె కలపాలి. తరువాత తామర లేదా సోరియాసిస్ ఉన్న ప్రాంతంలో ఈ నూనె ని రాయాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి. ముఖం మీద మొటిమలు ఉంటే వేప నూనె ప్రయోజనకరంగా ఉంటుంది. గోరుచుట్టు నొప్పి సమస్యను తొలగించడానికి వేప నూనె పని చేస్తుంది. వాస్తవానికి వేప నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. గోరుచుట్టు సమస్యను అధిగమించడానికి ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..