పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. కళ్ల నుంచి నీరు కారడం, కళ్ల మంటలు, తుమ్ములు, దగ్గు, గొంతు సమస్యలతో పాటు ఛాతీ ఇన్ఫెక్షన్లు, అస్తమా కూడా వస్తున్నాయి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులకు కాలుష్యం చాలా హాని కలిగిస్తోంది. ఉబ్బసం లేదా సీఏపీడీ రోగులే కాకుండా రోగ నిర్ధారణ చేయని కేసులు కూడా ఆసుపత్రులలో శ్వాసకోశ లక్షణాలను ప్రభావితమవుతున్నాయి. సాధారణ మందులు తీసుకున్నప్పటికీ.. ఆస్తమా వ్యాధి తీవ్రతరం కావడం మనం ఇప్పటికే చూశాం. తీవ్రమైన శ్వాసకోశ సమస్యల కారణంగా వారు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులు శ్వాసకోశ వ్యాధితో బాధపడే రోగులకు రెట్టింపు ఇబ్బంది కలిగిస్తుంది. గాలిలోఉండే అధిక స్థాయి కాలుష్య కారకాలు ఛాతీ సమస్యలకూ దారి తీస్తున్నాయి.
ఇన్ఫ్లుఎంజా, న్యుమోనియా నుంచి రోగనిరోధక శక్తిని పొందడం అనేది రక్షించడానికి ఉత్తమ మార్గం. వైద్యులు సూచించిన సాధారణ మందులు, ఇన్ హెలర్ లు ఉపయోగించడం ఉత్తమం. అధిక కాలుష్యం ఉన్న పరిస్థితుల్లో వాయు కాలుష్యానికి గురికావడాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రద్దీగా ఉన్న రోడ్లపై వెళ్లకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమై వెళ్లాల్సిన పరిస్థితులు వస్తే.. మాస్కులు ధరించడం, హెల్మెట్లు వేసుకోవడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. రోజువారీ దినచర్యలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..