Diabetic Health: డయాబెటిక్ బాధితులు యాపిల్ తినొచ్చా తినకూడదా.. నిపుణుల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

ఆరోగ్యానికి యాపిల్ ఎంత ప్రయోజనకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజూ ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదని నిపుణులు చెబుతుంటారు. యాపిల్స్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా..

Diabetic Health: డయాబెటిక్ బాధితులు యాపిల్ తినొచ్చా తినకూడదా.. నిపుణుల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
Apple

Updated on: Oct 08, 2022 | 9:26 PM

ఆరోగ్యానికి యాపిల్ ఎంత ప్రయోజనకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజూ ఆపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదని నిపుణులు చెబుతుంటారు. యాపిల్స్ లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. యాపిల్ తినడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే కాకుండా ఎముకలూ బలంగా తయారవుతాయి. అయితే డయాబెటిక్ బాధితులు ఆపిల్ తీసుకోవడం మంచిదేనా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అయితే ఓ హెల్త్‌లైన్ ప్రకారం యాపిల్స్‌లో చక్కెరలు ఉంటాయి. వాటిలో ఎక్కువ భాగం ఫ్రక్టోజ్ ఉంటుంది. అది రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం చూపించదు. యాపిల్ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు సహాయపడుతుంది. దీని కారణంగా ఇది డయాబెటిక్ రోగిలో రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచకుండా నివారిస్తుంది. అంతే కాకుండా యాపిల్స్‌లో ఉండే పాలీఫెనాల్స్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదింపజేయడంలో సహాయపడతాయి. యాపిల్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ), గ్లైసెమిక్ లోడ్ (జీఎల్) రెండింటిలోనూ తక్కువ ర్యాంక్‌ను కలిగి ఉన్నాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా నియంత్రించాయి.

క్రమం తప్పకుండా ఆపిల్ తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఎందుకంటే యాపిల్ తొక్కలో ఎక్కువగా ఉండే పాలీఫెనాల్స్ ఇన్సులిన్‌ను విడుదల చేయడానికి ప్యాంక్రియాస్‌ను ప్రేరేపించి, చక్కెర శోషణకు సహాయపడతాయి. అంతే కాకుండా యాపిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలగా ఉంటాయి. క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, ఫ్లోరిజిన్ మంచి ప్రయోజనాలు అందిస్తాయి. క్వెర్సెటిన్ కార్బ్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర పెరుగుదలను నివారించడంలో సహాయపడుతుంది. క్లోరోజెనిక్ యాసిడ్ చక్కెరను మరింత సమర్ధవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. ఫ్లోరిజిన్ రక్త ప్రవాహంలోకి చక్కెర శోషణను మందగించడంలో కూడా సహాయపడుతుంది.

పైన పేర్కొన్న సమాచారం ఆధారంగా.. యాపిల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గించడంలో, నిర్వహించడంలో సహాయపడతాయని స్పష్టమవుతుంది. అందువల్ల, డయాబెటిక్ పేషెంట్ డైట్‌లో యాపిల్‌ను చేర్చవచ్చని కచ్చితంగా చెప్పవచ్చు. పండ్లు, కూరగాయలు శరీరానికి మేలు చేసే మరియు దీర్ఘాయువును మెరుగుపరిచే పోషకాలతో నిండి ఉన్నాయి. అయితే, యాపిల్స్ తిన్న తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం మాత్రం మర్చిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి