మానవ శరీరంలో ఎముకల గూడు. ఎముకలు లేకుంటే.. శరీరానికి ఓ ఆకారం అంటూ ఉండదు. అంతే కాకుండా అవయవాలన్నీ బ్యాలెన్సింగ్ గా ఉండటానికి ఎముకలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే.. ఎముకలు సరిగ్గా పెరగకపోవడం, బలహీనత వంటి సమస్యలు తీవ్ర ఇబ్బందులు పెడుతుంటాయి. కాబట్టి వారి ఎముకలు బలంగా మారేందుకు అవసరమైన పోషకాహారం అందించడం చాలా ముఖ్యం. ఎముక ఏర్పడటానికి అత్యంత కీలకమైన సమయం చిన్నతనంలోనే కాబట్టి.. ఆ సమయంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ఎముకల ఆరోగ్యం గురించి ఆందోళన చెందకుండా.. కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
బాల్యంలో బలమైన ఎముక అభివృద్ధి.. మంచి ఎముక ఆరోగ్యానికి పునాదిగా పని చేస్తుంది. ఎముకల అభివృద్ధికి బాల్యం అత్యంత ముఖ్యమైన కాలం. మంచి పోషకాహారం, వ్యాయామం అనేది పిల్లల ఆరోగ్యం పెంపొందించడంలో కీలక విషయాలు. విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇది శరీరం కాల్షియంను గ్రహించడానికి సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ డి స్థాయిలు తగ్గడం వల్ల ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీంతో దానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతిరోజూ ఎండలో ఉండటం ద్వారా డి విటమిన్ ను పొందవచ్చు. వారానికి రెండు మూడు రోజులు కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు నేరుగా సూర్యరశ్మిని పొందేలా చేయాలి.
కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకల అభివృద్ధికి కాల్షియం అవసరమని అందరికీ తెలుసు. పాలు, జున్ను, పెరుగుతో సహా పాల ఉత్పత్తులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. బలమైన ఎముకలకు మద్దతు ఇవ్వడానికి మెగ్నీషియం కాల్షియంతో సహకరిస్తుంది. కాల్సిటోనిన్ అనే హార్మోన్‌కు మద్దతు ఇవ్వడానికి ఇది చాలా అవసరం. ఇది ఎముకల నిర్మాణాన్ని సంరక్షించడానికి, మృదు కణజాలం రక్తం నుంచి ఎముకలకు కాల్షియంను పునరుద్ధరిస్తుంది. కాబట్టి పిల్లల ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే గోధుమలు, క్వినోవా, బాదం, వేరుశెనగ, పచ్చి ఆకు కూరలు, నల్ల చిక్కుళ్లు వంటివి చేర్చుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..