Health: ఆరోగ్యమే కదా అని వీటిని తింటున్నారా.. రాత్రి భోజనంలో తినకూడని పదార్థాలివే.. నిపుణులు ఏమంటున్నారంటే..

మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా రాత్రి సమయాల్లో నిద్రపోయే వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్రపోకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎన్సీబీఐ ప్రకారం....

Health: ఆరోగ్యమే కదా అని వీటిని తింటున్నారా.. రాత్రి భోజనంలో తినకూడని పదార్థాలివే.. నిపుణులు ఏమంటున్నారంటే..
Curd

Updated on: Oct 12, 2022 | 7:14 AM

మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా రాత్రి సమయాల్లో నిద్రపోయే వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్రపోకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎన్సీబీఐ ప్రకారం.. తగినంత నిద్ర లేకపోవడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, నిరాశ, గుండెపోటు వంటి ప్రమాదాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా పని చేసి ఉదయాన్నే పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఈ పరిస్థితులు నిద్రలేమికి కారణమవుతుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. రాత్రి సమయంలో మనం తీసుకునే భోజనం కూడా నిద్రపై ప్రభావం చూపిస్తుంది. అయితే రాత్రి భోజనంలో తినకూడని కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. ఎంత ఆరోగ్యానికి ప్రయోజనమైనా రాత్రి సమయంలో పలు రకాల ఆహారపదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

రాజ్మా : యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం.. రాజ్మాలో ఐరన్, కాపర్, ఫోలేట్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సీ వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, రాజ్మాను రాత్రి సమయంలో తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మందగిస్తుంది. అంతే కాకుండా కడుపులో గ్యాస్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

బ్రోకలీ: బ్రోకలీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలిసిందే. అయితే డిన్నర్‌లో బ్రకోలీని ఎప్పుడూ తినకూడదు. బ్రకోలీలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. అలాగే రాత్రి పూట ఎలాంటి సమస్య లేకపోయినా ఉదయం నిద్ర లేవగానే గ్యాస్, ఎసిడిటీ సమస్య రావచ్చు.

ఇవి కూడా చదవండి

టొమాటోలు: రాత్రి భోజనంలో సలాడ్‌తో టొమాటోలను ఎప్పుడూ తినకూడదు. ఈ సూపర్ ఫుడ్ రాత్రి నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో టైరమైన్ అనే ఒక రకమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెదడు కార్యకలాపాలను పెంచుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రాత్రిపూట సరిగ్గా జీర్ణం కాకపోవడం లేదా ఉదయం ఎసిడిటీకి కారణమవుతుంది.

కాలీఫ్లవర్: సాధారణంగా ఆరోగ్యానికి చాలా మేలు చేసే కూరగాయ. కానీ రాత్రిపూట గాఢ నిద్రకు ఆటంకాలు కలిగించే కాలీఫ్లవర్‌కు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన నిద్ర కోసం రాత్రి భోజనంలో కాలీఫ్లవర్‌ను తినకపోవడమే మంచిది.

పెరుగు: పెరుగు తినడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ రాత్రికి సరైన ఆహారం కాదు. రాత్రంతా మెదడు చురుగ్గా ఉండేందుకు ఈ పెరుగు సరిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినకూడదు. ఎందుకంటే ఇది శ్లేష్మాన్ని ఉత్పత్రి చేసి కఫానికి దారి తీస్తుంది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.