Kidney Health: కిడ్నీలు రాళ్లు మళ్లీ మళ్లీ వస్తున్నాయా.. ఈ ఆహార పదార్థాలే కారణం..

కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు ఆహార విషయంలో అనేక సందేహాలు, అపోహలు పెట్టుకుంటారు. ముఖ్యంగా టమాటా, పాలకూర తినాలా వద్దా అనే అయోమయంలో ఉంటారు. నిజానికి, ఈ సమస్యకు కఠినమైన పత్యాలు అవసరం లేదని, అయితే రాళ్లు మళ్లీ మళ్లీ ఏర్పడకుండా నివారించడానికి మాత్రం సరైన ఆహార నియమాలు పాటించడం చాలా అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మూత్రపిండాలలో రాళ్లు రాకుండా, ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి పదార్థాలు తప్పించాలి, వేటికి ప్రత్యామ్నాయాలు వాడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.కిడ్నీ రాళ్లతో ఇబ్బంది పడేవారు, రాళ్లు మళ్లీ ఏర్పడకుండా నివారించాలనుకునేవారు ఆహార నియమాలు సరిగ్గా పాటించాలి. అధిక ఆక్సలేట్, ఉప్పు, చక్కెర పానీయాలు తగ్గించుకోవడం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Kidney Health: కిడ్నీలు రాళ్లు మళ్లీ మళ్లీ వస్తున్నాయా.. ఈ ఆహార పదార్థాలే కారణం..
Kidney Stones Diet, Oxalate Foods

Updated on: Oct 17, 2025 | 6:16 PM

మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటం శరీరంలో ఆక్సలేట్స్ అధికం కావటం, అవి మూత్రంలోని కాల్షియంతో కలవడం వలన జరుగుతుంది. అందుకే, రాళ్ల సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

తప్పించాల్సిన ఐదు ఆహారాలు, పానీయాలు:

ఆక్సలేట్ అధికంగా ఉంటే: నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ పరిశోధన ప్రకారం, పాలకూర, బీట్ రూట్, బాదం, స్విస్ చార్డ్ వంటి అధిక ఆక్సలేట్ ఉన్న పదార్థాల వాడకం పరిమితం చేయాలి. బదులుగా, తక్కువ ఆక్సలేట్ గల దోసకాయ, పుచ్చకాయ, అరటి పండ్లు, క్యాలీఫ్లవర్ వంటి పండ్లు, కూరగాయలు తినవచ్చు.

అధిక ఉప్పు: అధిక సోడియం తీసుకోవడం వలన మూత్రంలో కాల్షియం పెరుగుతుంది. అది రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా నివారించాలి. వంట చేసేటప్పుడు ఉప్పు బదులుగా నిమ్మరసం, మూలికలు, మసాలాలు వాడవచ్చు.

చక్కెర పానీయాలు: అధిక చక్కెర, ముఖ్యంగా ఫాస్పోరిక్ ఆమ్లం ఉన్న కూల్ డ్రింక్స్ మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. చక్కెర కాల్షియంను మూత్రంలోకి ఎక్కువగా పంపుతుంది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉన్న పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్, ముఖ్యంగా కోలా లాంటి పానీయాలు తాగకూడదు. ఇంట్లో తయారుచేసిన తాజా పండ్ల జ్యూస్ తాగడం, ఎక్కువ మంచినీరు తీసుకోవడం ఉత్తమం.

రెడ్ మీట్: మాంసంలో, ముఖ్యంగా రెడ్ మీట్, ఆర్గాన్ మీట్, షెల్ ఫిష్‌లలో ప్యూరిన్‌లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెంచి, రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. వీటికి బదులుగా కాయధాన్యాలు, బీన్స్, శనగలు వంటి లీన్ ప్రోటీన్లు, మితమైన చికెన్, చేపలు తీసుకోవడం మేలు.

విటమిన్ సి సప్లిమెంట్లు: మాయో క్లినిక్ అధ్యయనం ప్రకారం, అధిక మోతాదులో విటమిన్ సి సప్లిమెంట్లు వాడటం వలన కొంతమందిలో రాళ్లు ఏర్పడవచ్చు. అందుకే విటమిన్ సి సప్లిమెంట్లు అధికంగా తీసుకోకూడదు. నారింజ, స్ట్రాబెర్రీలు వంటి పండ్లు, కూరగాయల ద్వారా సహజంగా విటమిన్ సి పొందవచ్చు.

గమనిక: కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు రోజుకు 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల ద్రవాలు తాగాలి. ఆహార నియమాలలో మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదిం