Excessive Yawning: వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువగా ఆవలింతలు వస్తే.. మీ ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిందే..

Excessive Yawning: ఆవలింతలు వస్తున్నాయంటే.. శరీరం అలసిపోయింది. ఇక రెస్ట్ కోరుకుంటుంది.. నిద్రపోండి అని సూచన. ఆవలింతలు రావడం సర్వసాధారణం. అయితే ఆవలింతలు..

Excessive Yawning: వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువగా ఆవలింతలు వస్తే.. మీ ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిందే..
Yawning Heart Attack

Edited By:

Updated on: Jul 13, 2021 | 12:38 PM

Excessive Yawning: ఆవలింతలు వస్తున్నాయంటే.. శరీరం అలసిపోయింది. ఇక రెస్ట్ కోరుకుంటుంది.. నిద్రపోండి అని సూచన. ఆవలింతలు రావడం సర్వసాధారణం. అయితే ఆవలింతలు.. నిద్ర సమయంలో కాకుండా తరచుగా వస్తుంటే .. మాత్రం మీ గుండె పదిలమేనా అని ఆలోచించాలని హార్ట్ స్పెషలిస్టులు చెబుతున్నారు. గుండెపోటు.. ఇది వరకులా కాదు.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా వచ్చేస్తుంది. అప్పటివరకు ఉషారుగా ఉన్న వ్యక్తి, మాట్లాడుతున్న వ్యక్తి ఇలా ఎవరైనా సరే గుండె నొప్పితో హత్తుగా కుప్పకూలిపోతారు. నిర్ణీయ సమయంలోపు చికిత్స అందితే.. హార్ట్ పేషేంట్ మళ్ళీ బతికి బట్టకడతాడు. అయితే ఇలా గుండె నొప్పి రావటానికి ముందు కొన్ని సంకేతాలను శరీరం పంపిస్తుందని.. వాటిని నిర్లక్ష్యం చేయవద్దు .. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని అంటున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు గుండెకు రక్త ప్రవాహం నిరోధించబడుతుంది. ఇది ఆక్సిజన్ రవాణాలో అంతరాయం కలిగిస్తుంది. అప్పుడు గుండె కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఏమాత్రం గుండెపోటు సంకేతాలను గుర్తించినా వెంటనే తగిన చికిత్స తీసుకుంటే.. ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చు.
గుండె కండరాలకు రక్తం సరిగా అందక ఛాతి నొప్పి వస్తుంది. ఛాతిలో నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. దవడ, మెడ, భుజాలు, వీపు భాగాల్లో నొప్పిగా ఉంటుంది. వికారంగా, అలసటగా ఉంటుంది. నడిచినా, మెట్లెక్కినా ఆయాసంగా ఉంటుంది. గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్టు ఉంటుంది ఇవ్వన్నీ గుండె నొప్పికి సంకేతాలుగా మనకు తెలుసు. అయితే ఈ సంకేతాల్లో ఒకటి మితిమీరిన ఆవలింతలు అనివైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆవలింత వైద్య ప్రపంచంలో ఛేదించలేని ఒక రహస్యం. కొన్ని అధ్యయనాల ప్రకారం మెదడును శీతలీకరించడానికి ఆవలింత సహాయపడుతుంది అని తెలుసుకున్నారు. మితిమీరిన ఆవలింత అనేది వాగస్ నాడికి సంబంధించినది గుండె వైద్యులు చెబుతారు. ఇది మెదడు దిగువ నుండి గుండె నుంచి ఉదర భాగం వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, గుండె చుట్టూ రక్తస్రావం అధికంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఎక్కువగా ఆవలిస్తారు. ఇది గుండెనొప్పికి సంకేతంగా భావించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఎక్కువగా ఆవలింతలు హార్ట్ స్ట్రోక్ కు ముందు లేదా తరువాత రావచ్చునని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడు, వేడి రోజులలో ఎక్కువగా ఆవలింతలు వస్తే గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం పడుతున్నారు. అంతేకాదు అవలింతలతో పాటు ఇతర లక్షణాలు తిమ్మిరి, బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది పడడం కూడా గుండె పోటుకు సంకేతాలు.
అయితే ఆవలింత గుండెపోటు లేదా స్ట్రోక్‌తో మాత్రమే సంబంధం కలిగి ఉండదు. అనేక ఇతర ఆరోగ్య పరిస్థితులకు కూడా కారణమవుతాయి. బ్రెయిన్ ట్యూమర్ మూర్ఛ మల్టిపుల్ స్క్లేరోసిస్ కాలేయ వైఫల్యానికి శరీరం దాని ఉష్ణోగ్రతను నియంత్రించలేకపోతుంది. కనుక ఆవలింతలు రోజు రోజుకీ అధికంగా వస్తుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమమని చెబుతున్నారు. అవలింతకు గల కారణాన్ని వైద్యులు తెలుసుకుని తగిన విధంగా వైద్యం సూచిస్తారు. ఒక వేళ నిద్రలేమితో కనుక ఆవలింతలు వస్తుంటే.. అందుకు తగిన మెడిసిన్స్ ను సూచిస్తారు.. కనుక అవలింతలే కదా అని నిర్లక్ష్యం వద్దు.

Also Read: వంకాయలతో టేస్టీ రెసిపీ.. ఊరగాయ చేసే ఈజీ రెసిపీ..