Vegetarian Fish: శాఖాహార చేపలని ఎప్పుడైనా తిన్నారా.. ఈ రెస్టారెంట్‌లో లభిస్తాయంటా..!

|

May 29, 2022 | 11:39 AM

Vegetarian Fish: ఆహారానికి సంబంధించి తరచుగా అనేక పరిశోధనలు జరుగుతుంటాయి. ఆరోగ్య పరంగా శాకాహారం మంచిదని అందరికి తెలుసు. అందుకే ప్రపంచంలో శాఖాహారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Vegetarian Fish: శాఖాహార చేపలని ఎప్పుడైనా తిన్నారా.. ఈ రెస్టారెంట్‌లో లభిస్తాయంటా..!
Vegetarian Fish
Follow us on

Vegetarian Fish: ఆహారానికి సంబంధించి తరచుగా అనేక పరిశోధనలు జరుగుతుంటాయి. ఆరోగ్య పరంగా శాకాహారం మంచిదని అందరికి తెలుసు. అందుకే ప్రపంచంలో శాఖాహారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హెన్రిచ్ బోల్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 370 మిలియన్ల కంటే ఎక్కువ మంది స్వచ్ఛమైన శాఖాహారులు ఉన్నారని తేలింది. వీరు ఎటువంటి మాంసం, చేపలను తినరు. కానీ ఇలాంటి వారికి కూడా ఒక్కసారైనా నాన్‌వెజ్‌ రుచి టేస్ట్‌ చేయాలనిపిస్తుంది. అలాంటి వారి కోసం లండన్‌లో ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ వినియోగదారులకు ‘వెజిటేరియన్ ఫిష్’ ( వెజ్ ఫిష్ ) ఐటమ్స్‌ అందిస్తారు. ఇప్పుడు ‘వెజిటేరియన్ ఫిష్’ అంటే ఏమిటి అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. కాబట్టి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వాస్తవానికి ఈ రెస్టారెంట్‌లో చేపల ఆహార పదార్థాలను శాఖాహార పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి అచ్చం చేపల రుచిని కలిగి ఉంటాయి. వీటిని తినడం ద్వారా శాఖాహారం తింటున్నట్లు అనిపించదు ఎందుకంటే అవి చేపల రుచిని కలిగి ఉంటాయి. లండన్‌లో ఉన్న ఈ రెస్టారెంట్ పేరు డేనియల్ సుట్టన్. ఇక్కడ మీరు వేయించిన చేపల కూర నుంచి ఫిష్ చిప్స్ వరకు అన్ని ఐటమ్స్‌ తినవచ్చు. మీరు శాఖాహారులు అయిఉండి చేపలను రుచి చూడాలనుకుంటే మీరు ఈ రెస్టారెంట్‌కి రావచ్చు. సాధారణంగా శాఖాహారులు మాంసం, చేపలు తినడం పాపంగా భావిస్తారు. అలాంటి వారికి ఈ రెస్టారెంట్ సూపర్‌గా సెట్‌ అవుతుంది. ఇక్కడి ఫుడ్ ఐటమ్స్ అన్నీ వెజ్ కాబట్టి ఏ వెజిటేరియన్ అయినా నిస్సంకోచంగా తినొచ్చు.

మీడియా కథనాల ప్రకారం.. రెస్టారెంట్ యజమాని ‘శాఖాహారం చేపల’ రుచి నిజమైన చేపలతో సమానంగా ఉంటుందని చెబుతున్నాడు. వాటిని తిన్న తర్వాత నిజమైన చేపలు తిన్న ఫీలింగ్‌ కలుగుతుందట. అయితే వెజ్ ఫిష్‌ని ఒక ప్రయోగం ద్వారా తయారు చేస్తారని చెప్పాడు. అందులో అరటి పువ్వులు, సీప్లాంట్ సాంఫైర్‌ను ఉపయోగించి మసాలాలతో వేయించి చేపలను రుచి పోలిన ఆహార పదార్థాలని తయారుచేస్తామని వివరించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి