Health Tips: ఇలా నిద్రపోయినా కూడా మొటిమలు వస్తాయట.. ఎలా పడుకుంటే ఆరోగ్యానికి బెటర్!!

|

Sep 25, 2023 | 4:47 PM

నిద్ర పోవడం వల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా రెట్టింపు అవుతుంది. అయితే మనం పడుకునే విధానంపై కూడా పలు రకాల సమస్యలు వస్తాయి. కానీ అవేంటో.. ఎలా వచ్చాయో కూడా తెలీదు. చాలా మంది బాధ పడే సమస్యల్లో మొటి మలు కూడా ఒకటి. ముఖం క్లియర్ గా ఉండాలని అందరూ శ్రమ పడతారు. కానీ మనం తీసుకునే ఆహారం, నిద్ర పోయే పద్దతుల బట్టి కూడా ముఖంపై పింపుల్స్ వస్తాయి. మరికొంత మంది శరీర తత్వం బట్టి కూడా మొటిమలు వస్తాయి. అబ్బాయిల కంటే..

Health Tips: ఇలా నిద్రపోయినా కూడా మొటిమలు వస్తాయట.. ఎలా పడుకుంటే ఆరోగ్యానికి బెటర్!!
Sleeping
Follow us on

నిద్ర పోవడం వల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా రెట్టింపు అవుతుంది. అయితే మనం పడుకునే విధానంపై కూడా పలు రకాల సమస్యలు వస్తాయి. కానీ అవేంటో.. ఎలా వచ్చాయో కూడా తెలీదు. చాలా మంది బాధ పడే సమస్యల్లో మొటి మలు కూడా ఒకటి. ముఖం క్లియర్ గా ఉండాలని అందరూ శ్రమ పడతారు. కానీ మనం తీసుకునే ఆహారం, నిద్ర పోయే పద్దతుల బట్టి కూడా ముఖంపై పింపుల్స్ వస్తాయి. మరికొంత మంది శరీర తత్వం బట్టి కూడా మొటిమలు వస్తాయి. అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే ఈ మొటిమలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. కారణం హార్మోనల్ ఇన్ బ్యేలెన్స్ వల్ల.

నెలసరి సమయం కరెక్ట్ గా ఉన్నా.. లేకపోయినా కూడా ఇలా అవుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మన దైనందిన జీవితంలో చేసే కొన్ని పొరపాట్ల కారణం వల్ల ఈ మొటిమలు అనేవి వస్తూంటాయి. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్న వారికి ఎక్కువగా ఈ మొటిమలు అనేవి వస్తాయి. ముఖాన్ని ఎప్పుడూ క్లీని గా, శుభ్రంగా ఉంచుకోవాలి. అసలు మొటిమలు రావడానికి పలు రకాల కారణాలు ఉన్నాయి అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

బెడ్ శుభ్రంగా ఉంచుకోవాలి:

ఇవి కూడా చదవండి

నిద్రపోయే బెడ్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి. ఎక్కువ రోజులు అవే ఉంచకుండా.. పది రోజులకోసారి అయినా బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ అనేవి శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వాటిపై కూడా బ్యాక్టీరియా, క్రిములు అనేవి చేరి ఉంటాయి. మనం నూనె పెట్టుకుని తలగడ మీద పడుకుంటాం. ఆ నూనె పిల్లో కవర్స్ కూడా అంటుకుంది. అలా రెండు మూడు రోజులకు అక్కడ బ్యాక్టీరియా, క్రిములు అనేవి చేరతాయి.

వాటిపైనే మనం పడుకుంటాం కాబట్టి.. ఆ బ్యాక్టీరియా కారణంగా కూడా మొటిమలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే చాలా మంది బెడ్ మీదనే తింటూంటారు. అలా బెడ్ మీద ఆహారం తినకూడదు. బెడ్ మీద ఆహారం పడితే అక్కడ క్రిములు, ఫంగల్ బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, దుప్పటి వంటి వాటిని రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండాలి.

బోర్లా తిరిగి పడుకోకూడదు:

చాలా మంది బోర్లా పడి పడుకుంటారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలే కాకుండా.. మొటిమలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. బోర్లా తిరిగి పడుకుంటే దిండు అనేది నేరుగా ముఖానికి దగ్గరగా ఉంటుంది. దీంతో చర్మం, దిండు మధ్య రాపిడి జరిగి మొటిమలు వచ్చే అవకాశాలు ఉన్నాయట.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.