Summer Foods: ఎండాకాలం అధిక వేడి భరించలేకపోతున్నారా.. ఈ చల్లటి పదార్థాలు మీకు మంచి ఉపశమనం..!

|

May 25, 2022 | 5:09 PM

Summer Foods: వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మండుతున్న ఎండలు, చెమట కారణంగా ప్రజలు చాలా అలసటతో, నీరసంగా ఉంటారు.

Summer Foods: ఎండాకాలం అధిక వేడి భరించలేకపోతున్నారా.. ఈ చల్లటి పదార్థాలు మీకు మంచి ఉపశమనం..!
Summer Foods
Follow us on

Summer Foods: వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మండుతున్న ఎండలు, చెమట కారణంగా ప్రజలు చాలా అలసటతో, నీరసంగా ఉంటారు. ఈ పరిస్థితిలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మండే వేడిని నివారించాలంటే అనేక రకాల చల్లని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఈ ఆహారాలు నీరసం, అలసటను తొలగిస్తాయి. ఇవి చాలా రుచికరమైనవి. వేసవిలో ఏయే ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలో తెలుసుకుందాం.

1. శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు

వేసవిలో కడుపు చల్లగా ఉండేందుకు, గుండెల్లో మంట సమస్యలు రావొద్దంటే చల్లని రుచులతో కూడిన ఆహారాన్ని తినాలి. సొరకాయ, గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయలను వేసవిలో తింటే చాలా బాగుంటుంది. ఈ కూరగాయలు కడుపులోని వేడిని తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి

2. ఉల్లిపాయలు తినండి

ఉల్లిపాయ చల్లగా ఉంటుంది. వడదెబ్బ నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. మీరు దీన్ని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. దీనికి నిమ్మ, నల్ల ఉప్పును కలిపి తీసుకోవచ్చు. వీటిని మిక్స్ చేయడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

3. బెల్ సిరప్

బేల్ సిరప్ హీట్ స్ట్రోక్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. అయితే బేల్స్ సిరప్ తయారు చేసేటప్పుడు చక్కెరను ఉపయోగించవద్దు.

4.కుండలోని నీరు తాగాలి

వేసవిలో కుండ నీటిని తాగాలి. ఫ్రిజ్‌లోని నీటి కంటే కుండ నీరు చాలా మంచిది. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కుండ నీటిలో చాలా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి.

5. ఇతర ఆహారాలు, పానీయాలు

పుచ్చకాయ, సీతాఫలం, నీరు, మజ్జిగ, పెరుగు, దోసకాయ మొదలైన వాటిని వేసవిలో తీసుకోవాలి. ఈ ఆహారాలలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. అవి శరీరాన్నిచల్లగా ఉంచుతాయి. ఇవి వేసవిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి