Dry Grapes Benefits: ఎండు ద్రాక్షలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? తెలిస్తే తినకుండా ఉండలేరు..

అనేక రోగాలకు మందులా పనిచేసే ఎండు ద్రాక్షలలో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన మినరల్స్, విటమిన్లు, కెటెచిన్లు పుష్కలంగా అందుతాయి. ఎండుద్రాక్షలో ఐరన్..

Dry Grapes Benefits: ఎండు ద్రాక్షలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? తెలిస్తే తినకుండా ఉండలేరు..
Dry Grapes Benefits

Updated on: Jan 14, 2023 | 8:42 AM

మన ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్‌ ఎంతగానో మేలు చేస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ మన శరీర ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు చర్మ సంరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే పోషకాలే అందుకు ప్రధాన కారణం. ఇక డ్రై ఫ్రూట్స్‌లో ఎండు ద్రాక్ష ఎంతో ప్రముఖమైనదని చెప్పుకోవాలి. ఆయుర్వేదంలో కూడా ఎండు ద్రాక్షకు మంచి ప్రాధాన్యం ఉంది. ఆరోగ్య పరిరక్షణలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అనేక రోగాలకు మందులా పనిచేసే ఎండు ద్రాక్షలలో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన మినరల్స్, విటమిన్లు, కెటెచిన్లు పుష్కలంగా అందుతాయి. ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది రక్తహీనత సమస్య ఎదురవకుండా నిరోధిస్తాయి.

ఇంకా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు రాకుండా ఉంటాయి. వాత, పిత్త దోషాలు ఉన్న వారికి కూడా ఎండు ద్రాక్ష ప్రయోజనకరంగా ఉంటుంది. మూత్రపిండాలు, పేగు, మూత్రాశయం పనితీరుకి మెరుగుపరచడంలో కూడా ఎండు ద్రాక్ష ఉపకరిస్తుంది. ఎండు ద్రాక్ష తినడంతో సంతాన సాఫల్యం పెరుగుతుంది. ఎండు ద్రాక్షలను తినడం వల్ల మెదడుకు చురుకుదనం పెరిగి, ఏకాగ్రత దెబ్బతినకుండా ఉంటుంది.  దీంతో ఆర్థరైటిస్ తో బాధపడేవారికి  కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే  పినాలిక్ పదార్థాలు వివిధ రకాల క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తాయి. ఇవి రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.

ఎండు ద్రాక్షలో ఉండే పీచు పదార్థాలు శరీర జీర్ణశక్తిని పెంచడమే కాక మలబద్ధకం, డయేరియాను నిరోధిస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాకరిస్తాయి. అంతేకాక ఎండు ద్రాక్షలలో ఉండే విటమిన్ సీ, విటమిన్ ఏ, ఫైనో న్యూట్రియంట్స్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయసు పెరుగుతున్నప్పుడు వచ్చే మాక్యులర్ డీజెనరేషన్, గ్లకోమా, క్యాటరాక్ట్ సమస్యల రిస్క్‌ను తగ్గిస్తాయి. ఎండు ద్రాక్షలు కేశ సంరక్షణలో కూడా ఉపకరిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..