జీవనశైలి, శరీర అవసరాలను బట్టి ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. మనలో చాలా మంది చల్లటి నీరు తాగుతారు. కానీ ఆయుర్వేదం మాత్రం గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఉదయం పూట గోరువెచ్చని నీటిని తాగాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇది శరీరాన్ని లోపల నుంచి ఎన్నో సమస్యలను నయం చేస్తుంది. ఇంకా జీవక్రియను, జీర్ణక్రియను పెంచుతుంది. అందుకే ప్రతిరోజూ నాలుగు లీటర్లకు పైగా నీళ్లు తాగాలని సూచిస్తారు నిపుణులు..
కొందరు పొద్దున్నే లేచిన తర్వాత పళ్లు తోముకోకుండా నీళ్లు తాగుతారు. మరికొందరు పళ్లు తోముకున్న తర్వాత నీళ్లు తాగుతారు. అటువంటి పరిస్థితిలో బ్రష్ చేయడానికి ముందు నీరు తాగడం మంచిదా లేక.. బ్రష్ చేసిన తర్వాత నీరు తాగడం మంచిదా..? ఏది ప్రయోజనకరంగా ఉంటుంది.. అనేది ప్రశ్న చాలామందికి తలెత్తుతుంటుంది. ఇప్పుడు ఆ విషయాలను తెలుసుకుందాం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయం బ్రష్ చేయకుండా నీటిని తాగడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది. దీని వల్ల మీరు రోజులో ఏది తిన్నా బాగా జీర్ణం అవుతుంది. ఇది కాకుండా బ్రష్ చేయకుండా నీటిని తాగడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులను నయం చేయవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..