హాట్‌ సమ్మర్‌లో బాడీ హీటెక్కుతోందా..? చిల్డ్‌ బీర్‌ తాగితే కూల్‌ అవుతుందని సంతోషిస్తున్నారా..?

|

Mar 14, 2023 | 2:00 PM

ఇక కొందరు మందుబాబులు మాత్రం హాట్‌ సమ్మర్‌లో కూల్‌గా ఉండేందుకు గానూ చిల్డ్ బీర్లను లాగించేస్తుంటారు. వేసవిలో వేడి నుంచి తప్పించుకోవడానికి వీలైనన్ని బీర్లు తాగాలని వాదించేవారు కూడా ఉంటారు.

హాట్‌ సమ్మర్‌లో బాడీ హీటెక్కుతోందా..? చిల్డ్‌ బీర్‌ తాగితే కూల్‌ అవుతుందని సంతోషిస్తున్నారా..?
Beer
Follow us on

సమ్మర్‌ వచ్చేసింది. మార్చి మధ్యలోనే ఎండలు ఠారేత్తిస్తున్నాయి. ఇంకా రెండు నెలల ఎండాకాలం ఎలా ఉండదోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అయితే, ఎండాకాలంలో సాధారణంగానే ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తుంటారు. కొబ్బరి బొండాలు, మజ్జిగ, కూల్‌డ్రింక్స్, జ్యూస్‌లు, చెరుకు రసాలు వంటివి తాగి వేడిమి నుంచి ఉపశమనం పొందుతుంటారు. ఇక కొందరు మందుబాబులు మాత్రం హాట్‌ సమ్మర్‌లో కూల్‌గా ఉండేందుకు గానూ చిల్డ్ బీర్లను లాగించేస్తుంటారు. వేసవిలో వేడి నుంచి తప్పించుకోవడానికి వీలైనన్ని బీర్లు తాగాలని వాదించేవారు కూడా ఉంటారు. కానీ, బీర్ వల్ల డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వివరించారు. బీరు తాగిన సందర్భాల్లో.. శరీరం ఎక్కువ నీటిని పొందటం కంటే.. మూత్రం ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతున్నట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు. బీర్ మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీని వల్ల ఎక్కువ మూత్ర విసర్జన జరుగుతుంది. అధిక యూరిన్‌ వెళ్లటం వల్ల శరీరంలోని పోషకాలు కూడా పోతాయని వైద్యులు చెబుతున్నారు. ఇలా జరగడం శరీరానికి మంచిది కాదు.

హాట్‌ సమ్మర్‌లో నీరు పుష్కలంగా త్రాగాలి ఎందుకంటే ఇది నిర్జలీకరణానికి కారణమవుతుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేయండి. సమయానికి ఆహారం తినండి. ఆహారంలో ఎక్కువ పండ్లు, కూరగాయలను చేర్చుకోవడం వేడిని ఎదుర్కోవటానికి మార్గమని డాక్టర్లు వివరిస్తున్నారు. జ్వరం, ఇతర లక్షణాలు గమనించినట్లయితే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి.

వేసవిలో వైరల్ ఫీవర్, వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కంటే వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక జ్వరం, దగ్గుకు అనుగుణంగా చికిత్స చేయాలి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, ఊబకాయం ఉన్నవారు ఈ సమయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇతర వ్యాధులు వారి ఆరోగ్యాన్ని మరింత చెడుగా ప్రభావితం చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఎండాకాలంలో శరీరానికి తగినంత నీటిని అందించడంలో బీరు కంటే కూడా సాధారణ నీళ్లు, స్పోర్ట్స్ డ్రింక్‌లు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. కాగా, బీరు తాగడం వల్లనే శరీరం చల్లబడుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేయలేదు. కానీ, ఒకటి లేదా రెండు చిన్న బీర్లు తాగడం వల్ల శరీరానికి కావల్సిన నీరు అందుతుందని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..