Amla Juice benefits: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఉసిరి కాయ జ్యూస్‌ను ఇలా తీసుకోండి..

| Edited By: Ravi Kiran

May 12, 2022 | 9:57 AM

Amla Juice benefits: ఉసిరిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, అతిసారం, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇది శరీరంలో హానికరమైన ట్యాక్సిన్లు, విషతుల్య పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల అల్సర్లు, కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Amla Juice benefits: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఉసిరి కాయ జ్యూస్‌ను ఇలా తీసుకోండి..
Amla Juice
Follow us on

Amla Juice benefits: ఉసిరి ఒక సహజ ఔషధం. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా దీని ప్రాముఖ్యతను కూడా ప్రస్తావించారు. ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మన శరీరానికి అవసరమైన ఐరన్, క్యాల్షియం, పీచు వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఉసిరిని తీసుకోవడం వల్ల మలబద్ధకం, అతిసారం, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇది శరీరంలో హానికరమైన ట్యాక్సిన్లు, విషతుల్య పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల అల్సర్లు, కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్ల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఎలా తయారుచేసుకోవాలంటే..

ఉసిరి రసం ఒక రకమైన డిటాక్స్ డ్రింక్. దీనిని ఏ విధంగా తీసుకోవాలనేది చాలా ముఖ్యం. ఉసిరికాయ రసం ఉదయం పరగడుపునే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మొదట్లో 10 mg మోతాదులో మాత్రమే ఉంచాలి. ఆ తరువాత మోతాదును 20 mg కి పెంచుకోవచ్చు. మీకు కావాలంటే రోజుకు రెండుసార్లు కూడా ఉసిరి కాయ రసం తీసుకోవచ్చు. గోరువెచ్చని నీటిలో కలుపుకుని తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు మూడు టీస్పూన్ల ఉసిరి రసాన్ని కలుపుకుని తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉసిరి రసం ప్రయోజనాలు..

ఊబకాయాన్ని నివారించేందుకు..

ప్రస్తుతమున్న యాంత్రిక జీవనానికి తోడు అనారోగ్యకరమైన జీవనశైలితో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అలాంటివారికి గూస్‌బెర్రీస్‌ మంచి ఆహారం. ఇందులో కొవ్వును కరిగించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఉసిరి కాయ రసం తాగితే మంచిది.

జీవక్రియను మెరుగుపరచడం:
కడుపు సంబంధిత సమస్యలు, మలబద్ధకం, అజీర్ణం ఇతర కారణాల వల్ల జీవక్రియ రేటు మెరుగ్గా ఉండదు. అలాంటివారు గూస్బెర్రీ జ్యూస్ తీసుకోవడం మేలు. ఉసిరిలోని లక్షణాలు జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. పైగా ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది. అలాగే బరువు తగ్గడానికి సహకరిస్తుంది.

డయాబెటిస్ బాధితులకు..

డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇంది మంచి హెల్దీ డ్రింక్. మధుమేహ బాధితులు రోజూ వేడి నీటిలో కాసింత ఉసిరి రసం కలుపుకోని తాగడం వల్ల రక్తంలో బ్లడ్‌ షుగర్‌ స్థాయులు తగ్గిపోతాయి. అదేవిధంగా అధిక రక్తపోటు ప్రమాదాన్ని కూడా దూరం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Gastroenteritis: అక్కడ భారీగా పెరుగుతోన్న గ్యాస్ట్రో ఎంటెరిటిస్ కేసులు.. బాధితులతో నిండిపోతున్న ఆస్పత్రులు.. కారణమేంటంటే..

RR vs DC, IPL 2022: దంచికొట్టిన మార్ష్‌, వార్నర్‌.. RRపై ఢిల్లీ సూపర్‌ విక్టరీ.. ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు తెలంగాణ సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్‌.. ఆ థియేటర్లలో ఉదయం 4 నుంచే స్పెషల్ షోలు..