మన ఆరోగ్యంపై తీసుకునే ఆహారం ప్రభావం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తీసుకునే ఆహారమే మన ఆరోగ్యం ఎలా ఉండాలన్నదాన్ని నిర్ణయిస్తుంది. అయితే మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా తీసుకునే విధానంలో పొరపాట్లు చేస్తే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకునే మనం తీసుకునే ఆహారాలతో కొన్ని పదార్థలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని మీకు తెలుసా.? అలాంటి వాటిలో ఒకటి చికెన్ తిన్న తర్వాత తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. చికెన్ తిన్న వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటంటే..
చికెన్ తినే ముందు కానీ తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లో పాలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే కొంత మందికి చికెన్ తిన్న తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. చికెన్ లేదా మటన్ లాంటి ఆహార పదార్థాలను తీసుకున్న వెంటనే టీ తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, గుండెల్లో మంటకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. చికెన్ తీసుకున్న వెంటనే తీసుకోకూడని ఆహార పదార్థాల్లో తేనె కూడా ఒకటి. చికెన్ తినగానే తేనె తీసుకుంటే శరీరం వేడెక్కి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. చూశారుగా చికెన్ తిన్న తర్వాత ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలో.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..