శృంగారం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. స్త్రీ, పురుషుల మధ్య బంధాన్ని మరింత దృఢంగా మార్చే శక్తి కలిగింది. ఇద్దరు మనుషులను ఏకం చేసే శక్తి ఈ శృంగారానికి ఉంది. అయితే, ఈ శృంగారం సమయంలో, శృంగారంలో పాల్గొన్న తరువాత కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. జీవితాంతం బాధపడాల్సిన పరిస్థితి ఉంటుంది. శృంగారం చేసిన తరువాత కొన్ని పనులు అస్సలు చేయొద్దని, మరికొన్ని తప్పక చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తప్పులు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి చేయకూడదని, చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. శృంగారం చేసిన తరువాత మూత్ర విసర్జన చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది మహిళలు శృంగారం తరువాత మూత్ర విసర్జన చేయకుండా ఉంటారు. అలా చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. మూత్ర విసర్జన చేస్తే.. ఆ బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్తుంది.
2. శృంగారం చేసిన తరువాత జననాంగాలను సబ్బుతో కడుగొద్దు. స్త్రీలు ఇలా చేయడం వలన జననాంగంలో మంట, పొడిబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. సబ్బులు, హ్యాండ్ వాష్‌ల బదులు.. కేవలం నీటితో శుభ్రం చేసుకోవడం ఉత్తమం.
3. బిగుతుగా ఉండే దుస్తులు అస్సలు ధరించొద్దు. ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో తయారు చేసిన లోదుస్తులను ధరించడం వల్ల ఇన్‌ఫెక్షన్స్, దురద వంటి సమస్యలు వస్తాయి. శృంగారం తరువాత బిగుతైన లోదుస్తులు విడిచి తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం మంచిది.
5. శృంగారం సమయంలో స్త్రీ, పురుషులు జననాంగాలను స్పృషించడం సహజం. అయితే, శృంగారానంతరం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే మల్టిపుల్ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
శృంగారం వీటిని పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని, లేదంటే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..