Sweet Potatoes Benefits: చిలగడ దుంపలు తింటే నొప్పులు పెరుగుతాయా? తగ్గుతాయా?

| Edited By: Ravi Kiran

Aug 27, 2023 | 1:00 PM

ఆకు కూరల్లో రకాలున్నట్టే.. దుంపల్లోనూ వివిధ రకాలున్నాయి. దుంప కూరలంటే కేవలం ఆలుగడ్డలు (బంగాళ దుంపలు) మాత్రమే కాదు. బీట్ రూట్, క్యారెట్, ముల్లంగి, చామ దుంప, కంద, చిలగడ దుంప ఇవన్నీ దుంప జాతికి చెందినవే. కాళ్లనొప్పుల సమస్యలున్నవారు చిలగడ దుంపలను తింటే నొప్పులు రెట్టింపవుతాయని అనుకుంటారు. కానీ నిజానికి.. చిలగడ దుంపలను తింటే నొప్పులు, వాపులు తగ్గుతాయట. అంతేకాదు.. చిలగడ దుంపల్లో శరీరానికి శక్తిని, పోషకాలను..

Sweet Potatoes Benefits: చిలగడ దుంపలు తింటే నొప్పులు పెరుగుతాయా? తగ్గుతాయా?
Harvesting Sweet Potatoes
Follow us on

ఆకు కూరల్లో రకాలున్నట్టే.. దుంపల్లోనూ వివిధ రకాలున్నాయి. దుంప కూరలంటే కేవలం ఆలుగడ్డలు (బంగాళ దుంపలు) మాత్రమే కాదు. బీట్ రూట్, క్యారెట్, ముల్లంగి, చామ దుంప, కంద, చిలగడ దుంప ఇవన్నీ దుంప జాతికి చెందినవే. కాళ్లనొప్పుల సమస్యలున్నవారు చిలగడ దుంపలను తింటే నొప్పులు రెట్టింపవుతాయని అనుకుంటారు. కానీ నిజానికి.. చిలగడ దుంపలను తింటే నొప్పులు, వాపులు తగ్గుతాయట. అంతేకాదు.. చిలగడ దుంపల్లో శరీరానికి శక్తిని, పోషకాలను అందించే గుణాలున్నాయి.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు:

చిలగడ దుంపలలో ఫైబర్, విటమిన్లు ఏ, సీ, బీ6, పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా చూస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాహార లోపం సమస్య రాకుండా చూస్తాయి. చిలగడ దుంపలలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి చేరిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. చిలగడ దుంపలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపరిచి.. ఆకలితో పాటు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

షుగర్ పేషెంట్స్ సూపర్ ఫుడ్:

బరువు తగ్గాలనుకునేవారు చిలగడ దుంపలను కూడా తినవచ్చు. ఇవి రుచికి తియ్యగా ఉంటాయి. షుగర్ పేషంట్స్ కూడా వీటిని తినవచ్చు. తియ్యగా ఉన్నా.. వీటిలో షుగర్ ను కంట్రోల్ చేసే సమ్మేళనాలు ఉంటాయి. చిలగడ దుంపలలో ఉండే పొటాషియం హై బీపీని తగ్గిస్తుంది. చిలగడ దుంపలలో ఉండే ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. చిలగడ దుంపలను చాలా మంది నీటిలో ఉడకబెట్టి తింటుంటారు. కానీ.. వీటిని నిప్పుల్లో కాల్చుకుని తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మైక్రో-ఓవెన్ లో కూడా చిలగడ దుంపలను కాల్చుకుని తినవచ్చు.

క్యాన్సర్ కు చెక్.. మెదడు పనితీరు బెటర్:

ముఖ్యంగా చిలగడ దుంపలు కొన్ని రకాల కాన్సర్ల నుండి మనలని రక్షించడంలో సహాయపడతాయి అలాగే మూత్రాశయం, పెద్ద ప్రేగు, కడుపు, రొమ్ములో పెరిగే కాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. చిలకడ దుంపలను తినడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుంది. జంతువులపై జరిపిన కొన్ని అధ్యయనాల్లో ఈ దుంపలోని ఆంథోసైనిన్లు మంటను తగ్గించి ఫ్రీ రాడికల్ డామేజ్ ను తగ్గిస్తాయి. దానివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి