Health Tips: పాదాల నొప్పిని నిర్లక్ష్యం చేయకండి.. ఇది ఆ సమస్యలకు సంకేతం కావచ్చు..

|

Dec 01, 2021 | 7:29 PM

మీరు పాదం నొప్పితో బాధపడుతున్నారా..? ఉదయం లేవడంతోనే నేలపై పాదం పెట్టడానికి ఇబ్బందిగా ఉంటోందా..? నడిచేందుకు ఇబ్బందిగా మారిందా..? పాదాల నొప్పి..

Health Tips: పాదాల నొప్పిని నిర్లక్ష్యం చేయకండి.. ఇది ఆ సమస్యలకు సంకేతం కావచ్చు..
Pain Of Your Feet
Follow us on

మీరు పాదం నొప్పితో బాధపడుతున్నారా..? ఉదయం లేవడంతోనే నేలపై పాదం పెట్టడానికి ఇబ్బందిగా ఉంటోందా..? నడిచేందుకు ఇబ్బందిగా మారిందా..? పాదాల నొప్పి ఎలాంటి ఎలాంటి సంకేతాలను అందిస్తోంది..? వైద్యులు ఏమంటున్నారు..? మనం తరచుగా మన శరీరంలోని కొన్ని సమస్యలను లైట్ తీసుకుంటుంటాము. ఇలా సమస్య చిన్నగా ఉన్నప్పుడే శ్రద్ధ పెట్టాలి. సమస్యను వెంటనే చికిత్స చేయించుకోవాలి. సకాలంలో చికిత్స అందించడం వల్ల పెద్ద ఆరోగ్య సమస్యలను చెక్ పెట్టవచ్చు. ఇలాంటి సమస్యల్లో పాదం నొప్పి కూడా ఒకటి.  పాదాల నొప్పిని మనం ఎప్పుడూ విస్మరిస్తాం. కాళ్లలో నొప్పి  అసౌకర్యం వచ్చినప్పుడల్లా మనం దానిని చాలా సీరియస్‌గా తీసుకోము. కానీ అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యల విషయానికి వస్తే.. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పాదాల నొప్పిని విస్మరించకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అధిక కొలెస్ట్రాల్‌ను నిర్లక్ష్యం చేస్తే.. అది తరువాత పెద్ద సమస్యగా మారుతుంది. దీని వల్ల శరీరం కూడా ప్రభావితమవుతుంది. ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, ఇలా నెమ్మదిగా హార్ట్ స్ట్రోక్‌కు దారితీసే ప్రమాదం కూడా ఉంది. గుండె జబ్బు అత్యంత తీవ్రమైన లక్షణాల్లో పాదాల నొప్పి కూడా ఒకటి. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు సమస్య కాళ్ళలో కూడా కనిపిస్తుంది. ఈ సందర్భంలో కాలు కదలికలను ప్రభావితం చేసే కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె సమస్యలకు ముందస్తు ‘హెచ్చరిక’ సంకేతంగా మనం భావించాలి.

అధిక కొలెస్ట్రాల్‌తో పాదాల నొప్పి: దీనికి కారణం ఏమిటి?

అధిక బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిని హైపర్లిపిడెమియా అని కూడా అంటారు. ఇది పెరిగితే శరీరంలోని ధమనులు సరిగా పనిచేయడం మానేస్తాయి. ఇది మొదట మన గుండెలో చుట్టుపక్కల ఉన్న ధమనుల పనిని నిలిపివేస్తుంది. ఈ కారణంగా ఇది కొన్నిసార్లు కాళ్ళలోని ఇతర ప్రదేశాల ధమనులను ప్రభావితం చేస్తుంది. కాళ్లు కదలిక.. పనితీరు కోసం తగినంత రక్త ప్రసరణను అందుకోనప్పుడు ఇది పరిధీయ ధమని వ్యాధి లేదా PADకి కారణమవుతుంది.

ఇది ప్రమాదకరమా?

పాదాల నొప్పి చాలా ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొలెస్ట్రాల్ కూడా ఒక లోతైన కారణం అని వారు సూచిస్తున్నారు. అంతేకాకుండా శరీరంలో PADని అభివృద్ధి చేసే వ్యక్తులకు పాదాల నొప్పి ప్రారంభ గుండె సమస్యలు.. హృదయ సంబంధ వ్యాధులకు సంకేతం కావచ్చు.

కాళ్ళ నొప్పి తరచుగా అధిక కొలెస్ట్రాల్ లేదా హృదయ సంబంధ సమస్యల రూపంలో ఉంటుంది. చాలా సార్లు, సమస్యలు, తీవ్రమైన అసౌకర్యం.. నొప్పి పెరగడం వల్ల గుండెపోటు లేదా ఇతర స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే, కొన్నిసార్లు ఈ రకమైన నొప్పి నడక మొదలైన వాటి వల్ల కూడా వస్తుంది. ఇది మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు ఉపశమనం ఇస్తుంది. ఇది పాదంలో అడ్డుపడటానికి సంకేతం దీనిని క్లాడికేషన్ నొప్పి అంటారు. ఈ రకమైన నొప్పిని సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది తరువాత సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది.

పాదంలోని ఏదైనా భాగంలో భారంగా.. మంటగా అనిపించడం లేదా గట్టిగా అనిపించడం, పాదాల నొప్పి ఒక నిర్దిష్ట నమూనాను అనుసరిస్తుంది. ఆర్థరైటిస్ లేదా కండరాల నొప్పి వల్ల కూడా ఇలా వస్తుంది. ఇలాంటి సమస్యలు వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. 

ఇవి కూడా చదవండి: Car Accident: వ్యవసాయ బావిలో పడ్డ కారు.. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌ దగ్గర ప్రమాదం.. కారులో ఎంత మంది ఉన్నారో..

Jaggery Tea: బెల్లం చాయ్ రోజుకు అన్నిసార్లు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకో తెలుసా..