Health: రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?

ఒక అధ్యయనం ప్రకారం.. భారత్‌లో సగటును ప్రతీ వ్యక్తి రోజుకు 8 గ్రాముల ఉప్పును తీసుకుంటాడని తెలుస్తోంది. అయితే నిపుణులు సలహా మాత్రం రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పును తీసుకోవద్దని చెబుతున్నారు. నేచర్‌ పోర్ట్ ఫోలియో అనే జర్నల్‌లో ఈ అంశాలను పేర్కొన్నారు. ఈ సర్వేలో భాగంగా పరిశోధకులు మొత్తం 3000 మంది పరిగణలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే వీరి శరీరంలోని సోడియం...

Health: రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా.?
Salt

Updated on: Sep 26, 2023 | 2:51 PM

ఆహారంలో కచ్చితంగా ఉపయోగించే పదార్థాల్లో ఉప్పు ప్రధానమైంది. వంటకు రుచి రావడంతో ఉప్పు ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పు సరిపడ లేకపోతే ఆ వంటకు రుచి రాదు. ఇక ఉప్పు ద్వారా ఆరోగ్యానికి మేలు కూడా జరుగుతుందని తెలిసిందే. అయితే ఆ ఉప్పు ఎక్కువైతే మాత్రం తిప్పలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యలు రావడం తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఒక అధ్యయనం ప్రకారం.. భారత్‌లో సగటును ప్రతీ వ్యక్తి రోజుకు 8 గ్రాముల ఉప్పును తీసుకుంటాడని తెలుస్తోంది. అయితే నిపుణులు సలహా మాత్రం రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పును తీసుకోవద్దని చెబుతున్నారు. నేచర్‌ పోర్ట్ ఫోలియో అనే జర్నల్‌లో ఈ అంశాలను పేర్కొన్నారు. ఈ సర్వేలో భాగంగా పరిశోధకులు మొత్తం 3000 మంది పరిగణలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే వీరి శరీరంలోని సోడియం స్థాయిలను పరిశీలించారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు రోజువారీ పరిమితి కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నట్లు సర్వేలో తేలింది. అయితే స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇక నిరుద్యోగుల కంటే ఉద్యోగులే ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది. సగటున పురుషులు రోజుకు 8.9 గ్రాముల ఉప్పును తీసుకుంటుండగా, మహిళలు 7.9 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నట్లు తేలింది. అయితే అటు మహిళలు, ఇటు పురుషులు ఇద్దరూ నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నట్లు అధ్యయనంలో తేలింది.

స్థూలకాయంతో బాధపడే వారు అత్యధికంగా రోజుకు 9.2 గ్రాముల ఉప్పును తింటున్నట్లు అధ్యయనంలో తేలింది. అదే విధంగా రక్కపోటు ఉన్న వారు రోజుకు 8.5 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఉప్పులోని సోడయం రక్తపోటును పెంచుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది గుండెపోటుకు కారణంగా మారుతుంది. ఉప్పులో ఉండే సోడియం శరీరంలో కండరాలకు ఉపయోగపడుతుంది. అయితే 5 గ్రాములకు మించి తీసుకుంటే మాత్రం దుష్ప్రభావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులు, కిడ్నీ, వ్యాధులతో బాధపడే వారు ఉప్పుకు వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..