Monsoon Health Tips: వర్షాకాలంలో తులసి కషాయం తాగితే రోగాలు మటాష్.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా.

|

Aug 04, 2021 | 12:24 PM

హిందూ సంప్రదాయంలో తులసి చెట్టును దేవతగా పూజిస్తారు. ప్రతి ఇంటి ముందు తులసి చెట్టు నాటి పూజిస్తుంటారు. అంతేకాకుండా..

Monsoon Health Tips: వర్షాకాలంలో తులసి కషాయం తాగితే రోగాలు మటాష్.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా.
Tulsi Kadha
Follow us on

హిందూ సంప్రదాయంలో తులసి చెట్టును దేవతగా పూజిస్తారు. ప్రతి ఇంటి ముందు తులసి చెట్టు నాటి పూజిస్తుంటారు. అంతేకాకుండా.. ఆయుర్వేదంలో అనేక వ్యాధుల నివారణకు ఈ చెట్టును ఉపయోగిస్తుంటారు. ఇందులో ఔషద గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా..మారుతున్న కాలానుగుణంగా వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది. వర్షాకాలంలో పసుపు, తులసి కషాయాలు రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తాయి. తులసిలోని ఔషదగుణాలు అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తాయి. వర్షాకాలంలో అనేక రోగాలకు చెక్ పెట్టే తులసి పసుపు కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా.

కావాల్సినవి..
8-10 తులసి ఆకులు..
టెబుల్ స్పూన్ పసుపు
3-4 లవంగాలు
2-3 స్పూన్ల తేనె.
1-2 దాల్చిన చెక్కలు
తయారు చేసే విధానం…
ముందుగా ఒక బాణాలిలో నీరు తీసుకుని అందులో తులసి ఆకులు, పసుపు, లవంగాలు, దాల్చిన చెక్క కలిపుకోవాలి. దానిని 30 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి చల్లారిన తర్వాత తాగాలి. ఒకవేళ రుచి నచ్చకపోతే తేనెను కలుపుకోవచ్చు. రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూను నయం చేస్తుంది. ఈ కషాయాన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు తాగాలి.

ప్రయోజనాలు…
1. గొంతునొప్పి ఉన్నప్పుడు తులసి, పసుపు కషాయం తాగడం వలన ఉపశమనం లభిస్తుంది.
2. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ తులసి, పసుపు కషాయాన్ని తాగవచ్చు. దీనివలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయ.
3. తులసి కషాయాన్ని క్రమం తప్పకుండా తాగడం వలన శరీరంలోని విష పదార్థాలను నాశనం అవుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
4. కషాయాలను తాగడం ద్వారా, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.
5. మలబద్ధకం, విరేచనాల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
6. పసుపు, తులసి కషాయాలను రోజుకు 3 సార్లు త్రాగాలి.
7. వైరల్ ఇన్ఫెక్షన్స్, జ్వరం వంటి రోగాలను తగ్గిస్తుంది.

Also Read: Yashika Aannand: బ్రతికినంత కాలం దోషిగానే ఉండిపోతాను.. స్నేహితురాలిపై భావోద్వేగ పోస్ట్ చేసిన యాషిక..

Mirabai Chanu: ఒలంపిక్స్‏లో మీరాబాయి చాను రికార్డ్.. వెండితెరపై మధ్య తరగతి మహిళ జీవితం..

Aishwarya Rai: ఐశ్యర్య రాయ్ చెల్లెనా ఏంటీ ? అచ్చం అలాగే ఉందిగా.. ఇంటర్నెట్‏ను షేక్ చేస్తున్న యువతి..