Cheese Benefits: చీజ్ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!!

| Edited By: Ram Naramaneni

Oct 01, 2023 | 9:28 PM

చీజ్ అంటే ప్రతీ ఒక్కరికీ చాలా ఇష్టం. పాలతో తయారు చేసే వాటిల్లో ఇది కూడా ఒకటి. అయితే చీజ్ తింటే బరువు పెరుగుతారు, కొవ్వు పెరుగుతుంది, ఒళ్లు గుల్లబారిపోతుంది అని అంటూంటారు. ఇది కూడా నిజమే. అయితే ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే అందం, ఆరోగ్యం. ఎక్కువగా తీసుకుంటే నష్టాలే తప్ప ఏమీ ఉండవు. కాబట్టి చీజ్ ను కూడా సరైన మోతాదులో తీసుకుంటే శరీరానికి కూడా ప్రయోజనాలు చేకూరుస్తుంది. చీజ్ లో విటమిన్ ఏ, విటమిన్ బి12, ఫాస్పరస్, జింక్, క్యాల్షియం..

Cheese Benefits: చీజ్ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!!
Cheese
Follow us on

చీజ్ అంటే ప్రతీ ఒక్కరికీ చాలా ఇష్టం. పాలతో తయారు చేసే వాటిల్లో ఇది కూడా ఒకటి. అయితే చీజ్ తింటే బరువు పెరుగుతారు, కొవ్వు పెరుగుతుంది, ఒళ్లు గుల్లబారిపోతుంది అని అంటూంటారు. ఇది కూడా నిజమే. అయితే ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే అందం, ఆరోగ్యం. ఎక్కువగా తీసుకుంటే నష్టాలే తప్ప ఏమీ ఉండవు. కాబట్టి చీజ్ ను కూడా సరైన మోతాదులో తీసుకుంటే శరీరానికి కూడా ప్రయోజనాలు చేకూరుస్తుంది. చీజ్ లో విటమిన్ ఏ, విటమిన్ బి12, ఫాస్పరస్, జింక్, క్యాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. చీజ్ ను ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఎక్కువగా చూస్తూంటాం. పిజ్జా, బర్గర్, పాస్తా, చీజ్ ఇడ్లీ, చీజ్ దోశ వంటివి ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తూంటారు. చీజ్ ఆహారానికి మంచి టేస్ట్ ని ఇస్తుంది. అందుకే వీటితో తయారు చేసిన ఆహారాలు అంత కమ్మగా ఉంటాయి. పిల్లలు, యూత్ ఎక్కువగా ఇష్టపడి తింటూంటారు. ఇంకా చీజ్ తో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

చీజ్ లో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చీజ్ తినడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి పెరుగుతాయి. దీంతో ఇతర రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు చీజ్ తినడం మంచిదే.

ఇవి కూడా చదవండి

ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి:

చీజ్ తీసుకోవడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అంటే ఎముకలు బలహీనంగా ఉండటం, గుళ్ల బారిపోవడం, పగుళ్లు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది:

చీజ్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు.

బరువు తగ్గొచ్చు:

చీజ్ తో తయారు చేసిన ఆహారాలు కొంచెం తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో వేరే ఆహారాలను తీసుకోలేం. ఇలా బరువు కూడా తగ్గొచ్చు.

జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది:

చీజ్ లో ప్రోబయాటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. దీంతో మల బద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. పొట్టని ఆరోగ్యంగా ఉంచడంలో చీజ్ బాగా హెల్ప్ చేస్తుంది.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా చీజ్ బాగా ఉపయోగ పడుతుంది. చీజ్ తినడం వల్ల చర్మాన్ని లోపల నుంచి మెరిసేలా చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.