AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Protein Deficiency: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. ప్రోటీన్ లోపం ఉన్నట్లే!

శరీరానికి అన్ని రకాల పోషకాలు ఖచ్చితంగా కావాలి. లేకుంటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అన్నీ అందితేనే శరీరం హెల్దీగా ఉంటుంది. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఇలా ఏవి తక్కువైనా దాని ప్రభావం శరీరంపై పడుతుంది. ఫలితంగా వివిధ రోగాలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలాగని మరీ ఎక్కువైనా ప్రమాదమే. కాబట్టి అన్నీ సమపాలల్లో ఉండాలి. ఈ క్రమంలోనే చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధ పడుతూ ఉంటారు. కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలు తినడం..

Protein Deficiency: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. ప్రోటీన్ లోపం ఉన్నట్లే!
Protein
Chinni Enni
|

Updated on: Jan 29, 2024 | 1:47 PM

Share

శరీరానికి అన్ని రకాల పోషకాలు ఖచ్చితంగా కావాలి. లేకుంటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అన్నీ అందితేనే శరీరం హెల్దీగా ఉంటుంది. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఇలా ఏవి తక్కువైనా దాని ప్రభావం శరీరంపై పడుతుంది. ఫలితంగా వివిధ రోగాలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలాగని మరీ ఎక్కువైనా ప్రమాదమే. కాబట్టి అన్నీ సమపాలల్లో ఉండాలి. ఈ క్రమంలోనే చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధ పడుతూ ఉంటారు. కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల ప్రోటీన్ లోపం అనేది ఏర్పడుతుంది. దీనికి కారణంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ లెవల్స్ తగ్గిపోతాయి. దీంతో తరచుగా ఇన్ ఫెక్షన్లు, పలు రోగాల బారిన పడాల్సి వస్తుంది. మరి కొందరిలో అయితే జుట్టు రాలడంతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తాయి. ఒక్కోసారి శరీరంలో ప్రోటీన్ లోపం తక్కువైనా ఎలాంటి లక్షణాలు కనిపించవు. మరి అవేంటి? ప్రోటీన్ తక్కువైతే ఎలాంటి రిఫ్లెక్షన్స్ వస్తాయి ఇప్పుడు తెలుసుకుందాం.

కండరాల బలహీనత:

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఇది కూడా ఒకటి. కండరాలు బలహీన పడి.. ఏ పనీ చేయలేకపోతున్నారు. ప్రోటీన్ లోపం కారణంగా కండరాల్లో బలం తక్కువగా ఉంటుంది. దీని వల్ల శరీర ఆకృతి కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మీకు కండరాల సమస్యలు, నొప్పులు ఉన్నట్లయితే ఒక్కసారి ప్రోటీన్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.

జుట్టు విపరీతంగా రాలిపోవడం:

శరీరంలో ప్రోటీన్ తక్కువ అయినప్పుడు జుట్టు విపరీతంగా రాలిపోతుంది. కొంత మందిలో తెల్ల జుట్టు కూడా వస్తుంది. జుట్టు జీవం కోల్పోయి.. నిర్జీవంగా మారి పోతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా ప్రోటీన్స్ కలిగిన ఆహారం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి తగ్గి పోతుంది:

శరీరంలో ప్రోటీన్ శాతం తక్కువగా ఉన్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. దీంతో వ్యాధులతో పోరాడే బలం తగ్గి పోతుంది. ఒక్కసారిగా అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తాయి. నీరసంగా అనిపించడం, ఏ పని చేసినా త్వరగా అలసిపోయినట్టు అనిపించడం, పొట్ట ఉబ్బరం, శరీర శక్తి కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

బరువు తగ్గి పోతారు:

కొంత మందిలో ఈ లోపం కారణంగా బరువు కోల్పోతారు. కాబట్టి తరుచుగా మీరు ఒక్కసారిగా బరువు తగ్గిపోతుంటే.. ప్రోటీన్ టెస్ట్ చేయించుకోవడం మేలు. ఇంకొంత మందిలో శరీరంపై అక్కడక్కడ వాపులు కూడా కనిపస్తాయి. గోర్లు త్వరగా విరిగిపోయి.. పేలవగా కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటే వెంటనే డాక్టర్‌‌ని సంప్రదించాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'