Diabetes: మీకు డయాబెటిస్‌ ఉందా..? ఈ కూరగాయలకు దూరంగా ఉండటం మంచిది

|

Feb 16, 2023 | 9:00 AM

ఈ రోజుల్లో డయాబెటిస్‌ చాలా మందిని వెంటాడుతొంది. ఒక్కసారి డయాబెటిస్‌ వచ్చిందంటే చాలు జీవితంతం జాగ్రత్తగా ఉండాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్ప పూర్తిగా నివారించలేము..

Diabetes: మీకు డయాబెటిస్‌ ఉందా..? ఈ కూరగాయలకు దూరంగా ఉండటం మంచిది
Diabetes Food
Follow us on

ఈ రోజుల్లో డయాబెటిస్‌ చాలా మందిని వెంటాడుతొంది. ఒక్కసారి డయాబెటిస్‌ వచ్చిందంటే చాలు జీవితంతం జాగ్రత్తగా ఉండాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్ప పూర్తిగా నివారించలేము. అయితే మధుమేహం ఉన్నవారు ముఖ్యంగా ఆహార నియమాలలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. కొన్ని కూరగాయాలు ఎక్కువగా తీసుకుంటే మరికొన్ని కూరగాయాలకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. డయాబెటిక్ పేషెంట్లు కొన్ని కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో ఏ కూరగాయలను చేర్చుకోకపోవడం మంచిది.

  1. బంగాళదుంపలకు దూరం ఉండండి: బంగాళదుంపల వినియోగం మధుమేహ రోగుల ఆరోగ్యానికి చాలా హానికరం. ఇందులో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బంగాళాదుంపలు చాలా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయన్నట్లు. ఇది కాకుండా బంగాళదుంపలు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇది డయాబెటిస్‌ ఉన్నవారికి హానికరమని చెబుతున్నారు వైద్య నిపుణులు.
  2. మొక్కజొన్న తినవద్దు: మొక్కజొన్న గ్లైసెమిక్ ఎక్కువగానే ఉంటుంది. దీని కారణంగా ఇది డయాబెటిక్ రోగులకు హాని కలిగిస్తుంది. దీనిని తినాలని అనుకుంటే తినాలనుకుంటే, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంలో కలుపుకుని తినండి.
  3. బఠానీలు తినడం మానుకోండి: బఠానీలలో పిండి పదార్థాలు ఎక్కువగానే ఉంటాయట. అందుకే ఇది డయాబెటిక్ రోగులకు హాని కలిగిస్తుంది. మధుమేహం ఉన్నవారు వీటిని దూరంగా ఉండటం మంచిది.
  4. కూరగాయల రసం తాగవద్దు: పచ్చి కూరగాయల రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, ఈ పానీయంలో ఫైబర్ లోపం చాలా ఉంది. అందుకే డయాబెటిక్ రోగులకు ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. వెజిటబుల్ జ్యూస్ తాగే బదులు వాటిని డైట్ లో చేర్చుకుంటే మంచిది.
  5. ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి