ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మనదేశంలోనూ అంబరాలు అంబరాన్నంటాయి. కొందరు కుటుంబ సభ్యులతో న్యూ ఇయర్ జరుపుకుంటే మరికొందరు స్నేహితులు, సన్నిహితులతో, సహోద్యోగులతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని క్లబ్బులు, పబ్బులు పార్టీలతో కళకళలాడాయి. చాలాచోట్ల మద్యం ఏరులై పారింది. ఈనేపథ్యంలో చాలామంది ఫుల్లుగా తాగి ఉంటారు. పరిమితిగా మద్యం తీసుకుంటే ఏం కాదు కానీ మోతాదుకు మించి తాగితే మాత్రం హ్యాంగోవర్ తప్పదు. పార్టీ సమయంలో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంపై ప్రభావం చూపుతుంది, దీని కారణంగా అలసట, బద్ధకం, డీహైడ్రేషన్, వికారం, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు ఉంటాయి. ఈక్రమంలో హ్యాంగోవర్ నుంచి ఉపశమనం పొందేందుకు పాటించాల్సిన కొన్ని ఇంటి చిట్కాలేంటో తెలుసుకుందాం రండి.
ఆల్కహాల్ వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. హ్యాంగోవర్ తదితర సమస్యలు కలుగుతాయి. వీటిని వదిలించుకోవాలనుకుంటే ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత బాగా నీరు తాగాలి.దీని వల్ల శరీరంలోని ట్యాక్సిక్ ఎలిమెంట్స్ కూడా బయటకు వస్తాయి. కాస్త రిలీఫ్‌గా ఫీలవుతారు.
హ్యాంగోవర్‌ను తొలగించడంలో నిమ్మకాయ నీరు అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుంది. రాత్రి పార్టీ అయ్యాక నిద్రించే ముందు నిమ్మరసం తాగాలి. గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండుకుని తాగి పడుకోండి. ముఖ్యంగా తలనొప్పి నుంచి ఉపశమనాన్ని ఇవ్వడంలో నిమ్మరసం సమర్థంగా పనిచేస్తుంది.
ఉదయం నిద్రలేచిన వెంటనే అల్లం, తేనె బ్లాక్ టీ తాగండి. అల్లం ఉదర సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. తేనెలోని పోషకాలు తలనొప్పి పొగొడుతుంది.
హ్యాంగోవర్ కారణంగా చాలామందికి వికారం, వాంతులు కలుగుతుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి నీళ్లలో కాసిన్ని నిమ్మరసం జోడించుకుని తాగండి. దీనివల్ల శరీరంలో నీటి కొరత త్వరగా తీరుతుంది. హ్యాంగోవర్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
అరటి, యాపిల్ పండ్లను ముక్కలుగా చేసి సలాడ్ లాగా తినండి. ఇవి హ్యాంగోవర్‌లను తగ్గిస్తాయి. ముఖ్యంగా యాపిల్స్, అరటిపండ్లు ఎక్కువగా తినడం వల్ల హ్యాంగోవర్ నుండి త్వరగా బయటపడవచ్చు. వీటిలోకి 1-2 చెంచాల తేనె పోసి తినండి.
మోసంబిలో ఆల్కహాల్ ప్రభావాలను నియంత్రించే విటమిన్ సి ఉంటుంది. అందువల్ల ఇది హ్యాంగోవర్ లక్షణాలను కూడా తగ్గిస్తుంది.
హ్యాంగోవర్ నుంచి ఉపశమనం పొందడంలో టమోటా రసం అద్భుతంగా పని చేస్తుంది. టొమాటో రసంలో గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ జీర్ణం కావడానికి సహాయపడుతుంది. టమోటా రసంలో ఉండే ఎలక్ట్రోలైట్స్ రక్తంలో ఆల్కహాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
హ్యాంగోవర్ సమస్యలను తగ్గించడంలో పెరుగు కూడా సమర్థంగా పనిచేస్తుంది. పెరుగులో ఉండే యాసిడ్ ఉదర సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..1…