Spearmint Benefits: పుదీనాతో జీర్ణక్రియ సమస్యలు పరార్!!

| Edited By: Ravi Kiran

Aug 12, 2023 | 6:47 AM

పుదీనా.. దీనిని Spearmint లేదా Mint Leave అని కూడా పిలుస్తారు. సాధారణంగా దీనిని బిర్యానీలో లేదా ఇతర మాంసాహార వంటకాల్లో ఎక్కువగా వాడుతారు. కానీ పల్లెటూళ్లలో చూస్తే ఇప్పటికీ ఈ ఆకుతో పచ్చడి చేసుకుని తింటారు. అలాగే ఇప్పుడు సలాడ్స్, డెజర్ట్స్ లోనూ దీనిని వాడుతున్నారు. ఇంత ప్రాచుర్యం పొందిన పుదీనాలో ఎన్ని పోషకాలున్నాయో, ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. పుదీనాని ఇది ముఖ్యంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలపై..

Spearmint Benefits: పుదీనాతో జీర్ణక్రియ సమస్యలు పరార్!!
Mint Leaves Benefits
Follow us on

పుదీనా.. దీనిని Spearmint లేదా Mint Leave అని కూడా పిలుస్తారు. సాధారణంగా దీనిని బిర్యానీలో లేదా ఇతర మాంసాహార వంటకాల్లో ఎక్కువగా వాడుతారు. కానీ పల్లెటూళ్లలో చూస్తే ఇప్పటికీ ఈ ఆకుతో పచ్చడి చేసుకుని తింటారు. అలాగే ఇప్పుడు సలాడ్స్, డెజర్ట్స్ లోనూ దీనిని వాడుతున్నారు. ఇంత ప్రాచుర్యం పొందిన పుదీనాలో ఎన్ని పోషకాలున్నాయో, ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. పుదీనాని ఇది ముఖ్యంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలపై అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.

*100 గ్రాముల పుదీనా ఆకుల్లో 70 క్యాలరీలు ఉంటాయి. సోడియం 31 మిల్లీగ్రాములు, పొటాషియం – 569 మిల్లీగ్రాములు, కార్బోహైడ్రేట్లు 15 గ్రాములు, డైటరీ ఫైబర్లు – 8 గ్రాములు, ప్రొటీన్లు -3.8 గ్రా ఉంటాయి.

*అంతేకాదు.. విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B6, ఐరన్ లతో పాటు.. కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫోలేట్ కూడా లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

*కంటిచూపు మెరుగ్గా ఉండేందుకు కావలసిన విటమిన్ C పుదీనాలో పుష్కలంగా ఉంటుంది.

*పుదీనా ఆకుల్లో ఉండే మెంథాల్ అనే పదార్థం మిశ్రమం ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఐబీఎస్ అనే సమస్య ఉన్నవారికి కడుపునొప్పి, ఉబ్బరం, గ్యాస్, అకస్మాత్తుగా విరేచనం అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

*నోటి దుర్వాసనను తగ్గించడంలో పుదీనా బాగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే నాలుగైదు పుదీనా ఆకులను నమలడం ద్వారా నోటి దుర్వాసనను పోగొట్టుకోవచ్చు.

*ఇందులో ఉండే కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలే సమస్యను తగ్గించడంతో పాటు చుండ్రును కూడా నివారిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి