Eating Habits: 50 ఏళ్లు దాటిన వారు.. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. లేకపోతే..

|

Aug 15, 2022 | 12:47 PM

Eating Habits over 50: మనం తీసుకునే ఆహారం, పాటించే జీవనశైలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. సరైన పోషకాహారం తీసుకోకపోతే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం

Eating Habits: 50 ఏళ్లు దాటిన వారు.. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. లేకపోతే..
Eating Habits Over 50
Follow us on

Eating Habits over 50: మనం తీసుకునే ఆహారం, పాటించే జీవనశైలే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. సరైన పోషకాహారం తీసుకోకపోతే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తద్వారా భవిష్యత్‌లో కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత ఆహారంలో చక్కెర పరిమాణాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. దీని వల్ల గుండె జబ్బులు, మధుమేహం లేదా ఇతర ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు క్రమం తప్పకుండా కొన్ని ఆహారపు అలవాట్లు అనుసరించాల్సి ఉంటుంది.

డైట్ టిప్స్ ఇవే..

  • ఆహారంలో ప్రోటీన్లను చేర్చుకోవాలి. ప్రోటీన్లు కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే కండరాలను బలోపేతం చేస్తాయి. ప్రొటీన్‌లను తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఫలితంగా త్వరగా ఆకలి వేయదు
  • -నీరు ఎక్కువగా తాగాలి. ఏ వ్యక్తి అయినా ప్రతిరోజూ తగినంత నీటిని తాగడం చాలా ముఖ్యం, అయితే 50 ఏళ్లు దాటిన వారు మరింత ఎక్కువగా నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.
  • వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు విటమిన్ సి, డి సప్లిమెంట్లను తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.
  • ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కేలరీలు పెరుగుతాయి ఫలితంగా ఊబకాయం తదితర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆహారం అరగడం కూడా సమస్యగా మారొచ్చు. అందువల్ల తక్కువ మోతాదులో తరచూ తినాలి. తద్వారా త్వరగా ఆకలి వేయదు.

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా ఉంది. TV9 తెలుగు ధృవీకరించలేదు. ఇక్కడ ఇచ్చిన సమాచారం నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించాల్సి ఉంటుంది.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..