Diabetes: ఈ పండ్లు డయాబెటిక్ రోగులకు చాలా డేంజర్‌.. వీటికి దూరంగా ఉండటం మేలు

|

Sep 11, 2022 | 12:32 PM

Diabetes: దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. జీవనశైలి, తినే ఆహారం, నిద్రలేమి, ఒత్తిడి, కుటుంబ చరిత్ర తదితర కారణాల వల్ల ఎంతో మంది డయాబెటిస్‌..

Diabetes: ఈ పండ్లు డయాబెటిక్ రోగులకు చాలా డేంజర్‌.. వీటికి దూరంగా ఉండటం మేలు
Diabetes
Follow us on

Diabetes: దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. జీవనశైలి, తినే ఆహారం, నిద్రలేమి, ఒత్తిడి, కుటుంబ చరిత్ర తదితర కారణాల వల్ల ఎంతో మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. ఇక మధుమేహం ఉన్నవారు ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి లేకపోతే షుగర్స్‌ లెవల్‌ పెరిగిపోతే మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండటం మంఇచది. వీరు కొన్నింటికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. మామిడి పండు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పండు. ఇవి మధుమేహ రోగులకు అస్సలు మంచిది కాదు. షుగర్‌లెవల్స్‌ను పెంచుతుంది.

అరటిపండు చాలా సాధారణమైన పండు. ఇది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అయితే ఇది డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. ఎందుకంటే ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ వారి ఆరోగ్యానికి మంచిది. ఎంతో హానికరంగా భావించాలి.

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో పండించే లీచీని చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇందులో 16 గ్రాముల చక్కెర ఉంటుంది అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని దూరంగా ఉంచమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పైనాపిల్ కూడా అంత మంచిది కాదంటున్నారు. ఇందులో ఉండే అధిక చక్కెర మధుమేహ రోగులకు ఇబ్బంది కలిగిస్తుంది. లేకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇవి తిన్నా చాలా తక్కువ తినడం మంచిదంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి