ఇవి ఆకులు కాదు అద్భుతం.. డయాబెటిస్‌కు ఛూమంత్రం వేసినట్లే.. ఇక ఆ సమస్యలన్నీ పరార్..

ప్రస్తుత కాలంలో అనేక అనారోగ్య సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. అందుకోసం జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని.. దీంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి ఆకులు కాదు అద్భుతం.. డయాబెటిస్‌కు ఛూమంత్రం వేసినట్లే.. ఇక ఆ సమస్యలన్నీ పరార్..
మెంతి కూరలోని పోషకాలు శరీరంలోని విష పదార్ధాలను బయటకు పంపించడంలో దోహదం చేస్తాయి. దాంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మంపై ముడతల్ని దూరం చేస్తాయి. చర్మాన్ని యౌవనంగా ఉంచుతాయి. స్వభావరీత్యా మెంతి కూర వేడి చేస్తుంది.
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 03, 2024 | 9:40 AM

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా లక్షలాది మంది మధుమేహం బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని.. అందుకోసం జీవనశైలి, ఆహారం విషయంలో మార్పులు అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ బాధితులకు మెంతికూర అద్భుతమని వైద్య నిపుణుల చెబుతున్నారు. వాస్తవానికి మధుమహానికి గొప్ప ఆహారం మెంతులు, మెంతికూర.. వీటి ప్రయోజనాల గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు.. అయితే, షుగర్ బాధితులు మెంతి ఆకులను తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంటున్నారు. మెంతి ఆకులను రోజూ తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకోండి..

మెంతికూరలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి.. కొన్నేళ్లుగా మెంతి గింజల్లోని ఔషధ గుణాలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. సౌదీ అరేబియాలోని ఒక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరిశోధనలో మెంతి గింజల్లో యాంటీడయాబెటిక్, యాంటీకాన్సర్, యాంటీమైక్రోబయల్, యాంటీఫెర్టిలిటీ, యాంటీపరాసిటిక్, ల్యాక్టేషన్ స్టిమ్యులేట్, హైపో కొలెస్ట్రాలెమిక్ లక్షణాలు మెంతి ఆకుల్లో ఉన్నాయని తేలింది.

రోజువారీ ఆహారంలో మెంతి ఆకుకూరలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని పేర్కొంటున్నారు. మెంతులు, మెంతికూర ప్రోటీన్, ఫైబర్ కు గొప్ప మూలం.. దాని బయోయాక్టివ్ సమ్మేళనాలు కారణంగా ఔషధంగా ఉపయోగించవచ్చు. అనేక ఆరోగ్య సమస్యలకు మెంతికూర మందుగా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది.

మధుమేహంలో మెంతులు – మెంతి కూర ప్రయోజనాలు

మధుమేహంలో మెంతి ప్రయోజనాలు గురించి కూడా పరిశోధనలు జరిపారు. ఒక వ్యక్తిలో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌తో సంబంధం ఉన్న జీవక్రియ లక్షణాలను తగ్గించడంలో మెంతి వినియోగం ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు. దీన్ని తీసుకోవడం వల్ల రోగుల రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. రోగి గ్లూకోజ్ స్థాయి గణనీయంగా మెరుగుపడుతుంది.

మెంతులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి..

ఇన్సులిన్ డిపెండెంట్ టైప్ 1 డయాబెటిస్ ఉన్న రోగులలో.. వారి రోజువారీ ఆహారంలో 100 గ్రాముల పొడి మెంతి గింజలను తీసుకోవడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు.

ఇతర ప్రయోజనాలు..

మెంతిలోని యాంటీవైరల్ లక్షణాలు గొంతు నొప్పికి శక్తివంతమైన హెర్బల్ రెమెడీగా చేస్తాయి. జుట్టు రాలడం, మలబద్ధకం, పేగు ఆరోగ్యం, మూత్రపిండ వ్యాధి, హాట్ ఫ్లాషెస్, మగ వంధ్యత్వం, ఇతర రకాల లైంగిక బలహీనతలకు చికిత్స చేయడంలో మెంతులు, మెంతి కూర ప్రభావవంతంగా ఉంటాయని పరిశోధకులు వివరించారు.

అయితే.. మెంతి ఆకులతో నీరు లేదా కూర, చట్నీ, మెంతి రోటి.. ఇలా అనేక రకాల వంటలను తయారు చేసుకోని తీసుకోవచ్చు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టెట్‌కు మీరూ దరఖాస్తు చేసుకున్నారా? అయితే కీలక అప్‌డేట్ మీ కోసమే
టెట్‌కు మీరూ దరఖాస్తు చేసుకున్నారా? అయితే కీలక అప్‌డేట్ మీ కోసమే
ఆ దేవాలయం చుట్టూ పక్షుల ప్రదక్షిణలు.. దేవుడి మహిమే అంటున్న జనం
ఆ దేవాలయం చుట్టూ పక్షుల ప్రదక్షిణలు.. దేవుడి మహిమే అంటున్న జనం
'మీరు క్షమార్హులు కాదు సార్' పోసానిపై టాలీవుడ్ నిర్మాత ట్వీట్
'మీరు క్షమార్హులు కాదు సార్' పోసానిపై టాలీవుడ్ నిర్మాత ట్వీట్
ఏపీ ప్రజలకు అలర్ట్‌.. మరో అల్పపీడనం.. భారీ తుఫాను ముప్పు!
ఏపీ ప్రజలకు అలర్ట్‌.. మరో అల్పపీడనం.. భారీ తుఫాను ముప్పు!
గ్లోబల్ సమ్మిట్‌లో జర్మనీ వ్యవసాయ మంత్రి హైలెట్ చేసిన పాయింట్స్
గ్లోబల్ సమ్మిట్‌లో జర్మనీ వ్యవసాయ మంత్రి హైలెట్ చేసిన పాయింట్స్
ఉత్పన్న ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి డబ్బు ఇబ్బందులు తీరతాయి
ఉత్పన్న ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి డబ్బు ఇబ్బందులు తీరతాయి
ఇక నెట్టింట అతి చేస్తే తప్పదు భారీ మూల్యం...
ఇక నెట్టింట అతి చేస్తే తప్పదు భారీ మూల్యం...
నిరుద్యోగులకు అలర్ట్‌.. రైల్వే పరీక్షల తేదీలు మళ్లీ మారాయ్‌..!
నిరుద్యోగులకు అలర్ట్‌.. రైల్వే పరీక్షల తేదీలు మళ్లీ మారాయ్‌..!
ఈ బీటెక్ అబ్బాయి ఇప్పుడు టాలీవుడ్‌ క్రేజీ హీరో.. గుర్తుపట్టారా?
ఈ బీటెక్ అబ్బాయి ఇప్పుడు టాలీవుడ్‌ క్రేజీ హీరో.. గుర్తుపట్టారా?
రిలీజ్ కి ముందే పుష్పరాజ్ రికార్డుల మోత.! మాములుగా లేదుగా..
రిలీజ్ కి ముందే పుష్పరాజ్ రికార్డుల మోత.! మాములుగా లేదుగా..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!