Diabetes Home Remedy: ఉల్లిపాయ తింటే మధుమేహం అదుపులో ఉంటుందా..?

|

May 31, 2023 | 8:05 AM

డయాబెటిస్‌.. ఇది ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరికి వెంటాడుతోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో డయాబెటిస్‌ పేషెంట్లు ఉంటున్నారంటే ఏ మేరకు వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది రావడానికి వివిధ..

Diabetes Home Remedy: ఉల్లిపాయ తింటే మధుమేహం అదుపులో ఉంటుందా..?
Diabetes Home Remedy
Follow us on

డయాబెటిస్‌.. ఇది ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరికి వెంటాడుతోంది. దేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో డయాబెటిస్‌ పేషెంట్లు ఉంటున్నారంటే ఏ మేరకు వ్యాపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. కుటుంబ చరిత్ర కారణంగా, టెన్షన్‌, సమయానికి భోజనం చేయకపోవడం తదితర కారణాల వల్ల అందరికి వ్యాపిస్తోంది. ఒక్కసారి మధుమేహం వ్యాధి వచ్చిదంటే చాలు జీవన శైలిని మార్చుకుని అదుపులో పెట్టుకోవాలి తప్ప.. పూర్తిగా నయం చేసుకోలేము.

టైప్-1 లేదా టైప్-2 డయాబెటిస్‌ చాలా మందికి వస్తోంది. అయితే ఏ రకమైన డయాబెటిస్ అయినా దాన్ని కేవలం ఒక్క ఉల్లిపాయతో నియంత్రించవచ్చట. పచ్చి ఉల్లిగడ్డ ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ కంట్రోల్ అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. అమెరికన్‌ పరిశోధకులు నిర్వహించిన పలు పరిశోధనల నివేదికల ప్రకారం.. ఉల్లిగడ్డలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిగడ్డ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గి, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఉల్లిలో క్రోమియం ఎక్కువగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఉల్లిపాయను 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

మధుమేహంతో పోరాడడంలో ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించగల పదార్ధాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడే సరైన మొత్తంలో క్రోమియం ఉండటం వల్ల మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఉల్లిపాయ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయ రసం ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగులు తప్పనిసరిగా ఉల్లిపాయ రసంతో తమ రోజును ప్రారంభించాలి. ఇది జీర్ణవ్యవస్థను, రక్తంలో చక్కెరను ఏకకాలంలో మెరుగుపరుస్తుంది.

అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయలు మేలు చేస్తాయి. జుట్టు పెరుగుదలకు మేలు చేసే సల్ఫర్ ఇందులో ఉంటుంది. ఉల్లిపాయ రసాన్ని వారానికి రెండు రోజులు కూడా మీ జుట్టు మరియు తలకు పట్టిస్తే, మీ జుట్టు నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి