ఆహారం జీర్ణమవడం లేదా.. మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆయుర్వేద డ్రింక్‌తో సమస్యకి చెక్..?

|

Feb 11, 2022 | 12:18 PM

Detox Drink: డిటాక్స్ డ్రింక్స్‌ని పండ్లు, కూరగాయలు, మూలికలు, సుగంధ ద్రవ్యాల నుంచి తయారు చేస్తారు. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడుతాయి.

ఆహారం జీర్ణమవడం లేదా.. మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆయుర్వేద డ్రింక్‌తో సమస్యకి చెక్..?
Detox Drinks
Follow us on

Detox Drink: డిటాక్స్ డ్రింక్స్‌ని పండ్లు, కూరగాయలు, మూలికలు, సుగంధ ద్రవ్యాల నుంచి తయారు చేస్తారు. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తాయి. జీర్ణక్రియ సంబంధిత సమస్యలను అధిగమించడానికి, జీర్ణవ్యవస్థను వేగవంతం చేయడానికి తోడ్పడుతుంది. ఇది మీ జీవక్రియ రేటును పెంచుతుంది. గుండెకు కూడా చాలా మంచిది. నల్ల మిరియాలు, లవంగాలను ఉపయోగించి ఇంట్లో డిటాక్స్ డ్రింక్‌ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ఈ డ్రింక్‌ తయారుచేయడానికి 1 గ్లాసు నీరు, 2 లవంగాలు, 4 నల్ల మిరియాలు అవసరం. లవంగాలు, మిరియాలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఒక బాణలిలో ఈ నీటిని పోసి మరిగించాలి. ఫిల్టర్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం లేదా రాతి ఉప్పు కలపాలి. మీ డిటాక్స్ డ్రింక్ రెడీ అయిపోయింది. లవంగం భారతీయ వంటగదిలో ఉపయోగించే ఒక మసాలా దినుసు. ఇది ఔషధంగా కూడా పనిచేస్తుంది. లవంగాలలో యూజినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

ఇది మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మారుతున్న సీజన్లలో జలుబు, దగ్గు సాధారణ ఆరోగ్య సమస్యలు. ఈ డిటాక్స్‌ డ్రింక్ తాగితే ఈ సమస్యలు పరిష్కారమవుతాయి. నల్ల మిరియాలు భారతీయ వంటశాలలలో ఉపయోగించే మరొక మసాలా దినుసు. ఇవి మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గించడంలో, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతాయి.

Sore Throat: కొవిడ్‌ మొదటి లక్షణం గొంతునొప్పి.. తగ్గడానికి ఇంట్లో ఈ ఆయుర్వేద పద్ధతులు..?

Health News: ఈ గింజలు తింటే డయాబెటీస్‌ కంట్రోల్‌.. గుండె జబ్బుల ప్రమాదం తక్కువ..?

IPL 2022: 590 మంది ఆటగాళ్ల భవితవ్యం.. IPL 2022 వేలం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందంటే..?