ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితం కరోనా వైరస్ కు ముందు తర్వాత అని చెప్పవచ్చు.. కరోనా వైరస్ దేశ ఆర్ధిక పరిస్థితులపైనే కాదు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ సోకిన తర్వాత అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కోవిడ్ కారణంగా పురుషుల సంతానోత్పత్తి కూడా దెబ్బతింటోంది. కరోనా సెక్స్ లైఫ్‌పై ప్రభావం చూపిందని వైద్యులు చెబుతున్నారు . కోవిడ్ కారణంగా చాలా మంది పురుషులు అంగస్తంభన సమస్యకు గురవుతున్నారు. వైరస్ కారణంగా వృషణాలు దెబ్బతిన్నాయి. దీని వల్లే ఇలా జరుగుతోంది. అంతేకాదు.. కరోనా మహమ్మారి సమయంలో క్షీణించిన మానసిక ఆరోగ్యం కూడా సెక్స్ జీవితం క్షీణించడానికి ప్రధాన కారణం అని చెబుతున్నారు.
కరోనా సమయంలో మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఈ ప్రభావం శరీరంపై కూడా ప్రత్యక్షంగా చూపిస్తుంది. పురుషులు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య కేవలం 18 నుంచి 45 ఏళ్లలోపు పురుషుల్లో మాత్రమే కనిపిస్తోంది. కరోనా మహమ్మారి తర్వాత పురుషుల లైంగిక ఆరోగ్యం బాగా దెబ్బతిందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్‌తో పాటు ధూమపానం, మద్యపానం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం అని.. ఊబకాయంతో బాధపడేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తోందని చెబుతున్నారు వైద్యులు.
వైద్యులు ఏమి చెబుతున్నారంటే?
యూరాలజిస్ట్ డాక్టర్ మోహన్ కేశవమూర్తి ఇదే విషయంపై మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పురుషులపై తీవ్ర ప్రభావం పడిందని.. అప్పటి నుంచి అంగస్తంభన సమస్య చాలా ఎక్కువైందని చెప్పారు. ఇంకా చెప్పాలంటే కోవిడ్ పురుషుల లైంగిక జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసింది.. కోవిడ్‌కు ముందు, ప్రతి నెలా ఈ సమస్య 30 నుండి 40 కేసులు వచ్చేవి.. అయితే ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. అంగస్తంభన, నపుంసకత్వము నయం చేసే శస్త్రచికిత్సలు కూడా మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు కేశవమూర్తి.
అధికమైన పరిశోధనలు..
జర్నల్ ఆఫ్ ఇమ్యునిటీ రీసెర్చ్‌లో కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా పురుషుల లైంగిక జీవితం క్షీణించిందని పేర్కొంది. మగవారిలో సెక్స్ కోరిక తగ్గింది. పురుషులు శారీరక సంబంధం కలిగి ఉన్నప్పుడు.. అంగస్తంభనతో ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్‌తో పాటు, సరైన ఆహారం లేకపోవడం, జీవనశైలికి మార్పులు, వివిధ రకాల ఇతర వ్యాధులు, హార్మోన్ అసమతుల్యత దీనికి ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు అని అధ్యయనాలు వెల్లడించింది. ఇతర అవయవాల మాదిరిగానే, కోవిడ్ వైరస్ పురుషుల వృషణాలపై కూడా ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. పురుషుల జననాంగాలలో రక్తప్రసరణ ప్రభావితమై..అంగస్తంభన లోపం ఏర్పడుతుందని తెలుస్తోంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..