Health: సరైన డైట్ తో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు..

|

Aug 22, 2022 | 10:12 PM

ప్రతి ఒక్కరిలో మలబద్ధకం సాధారణమైన ఆరోగ్య సమస్య, మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలబద్ధకం లేదా మలవిసర్జన సమస్యకు చెక్ పెట్టొచ్చు. మొదట్లో మలబద్దకం పెద్ద సమస్యగా కనిపించనప్పటికి..

Health: సరైన డైట్ తో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు..
Constipation1
Follow us on

Health: ప్రతి ఒక్కరిలో మలబద్ధకం సాధారణమైన ఆరోగ్య సమస్య, మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలబద్ధకం లేదా మలవిసర్జన సమస్యకు చెక్ పెట్టొచ్చు. మొదట్లో మలబద్దకం పెద్ద సమస్యగా కనిపించనప్పటికి.. ఇది దీర్ఘకాలిక సమస్యగా మారితే.. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది దారితీస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కోసం తీసుకునే ఆహారంలో ఎక్కువ పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. కేవలం డైటింగ్ మార్పులే కాకుండా.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మలవిసర్జన సమస్యను దూరం చేసుకోవచ్చు. ఈసమస్యకు చెక్ పెట్టడానికి ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలో డైటీషియన్ మన్ ప్రీత్ కల్రా చెప్తున్న డైట్ ప్లాన్ ని ఇప్పుడు చూద్దాం..
1 )తులసి గింజలను రాత్రిపూట నానబెట్టి.. వాటిని ఉదయం తినాలి. రోజుకు ఒక స్పూన్ మోతాదులో వీటిని తీసుకోవాలి. తులసి గింజలులో అధిక మొత్తంలో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తాయి. తులసి గింజలను తినడంతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. తులసి ఆకులతో పాటు తులసి గింజల లో కూడా అనేక పోషకాలు ఉంటాయి.

2) 5బాదం పప్పులు, 1 వాల్ నట్, 3 నల్ల ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలి.

3) అల్పాహారంగా అంజీర్, ఖర్జూరం కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడం మంచిది. దీనిని తయారుచేసుకోవడం కోసం 2 అంజీర్లు, 2 ఖర్జుర పండ్లు, 1/4 కప్పు ఓట్స్, 3/4 కప్పు పాలు, చిటికెడు దాల్చిన చెక్క, చిటికెడు జాజికాయ, 1 టీస్పూన్ చియా గింజలను తీసుకుని.. వీటన్నింటిని కలిపి మిశ్రమంగా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

4) ఉదయం 11 గంటల సమయంలో బొప్పాయి తినడం మంచిది.

5) మద్యాహ్నం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు మజ్జిగ, 1/2 స్పూన్ గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి.

6)సాయంత్రం 5గంటలకు దోసకాయ, క్యారెట్, బీట్ రూట్ ను పెరుగుతో కలుపుకుని తినాలి.

7) రాత్రి భోజనానికి ముందు 1టేబుల్ స్పూన్ సైలియం పొట్టును గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి.

8) రాత్రి 7గంటల సమయంలో రాత్రి భోజనం కోసం వెజిటేబుల్ పలావును తీసుకోవచ్చు.

9) రాత్రి పడుకోవడానికి ముందు ఒక గ్లాసు పాలులో 1/2 టీస్పూన్ నెయ్యి, చిటికెడు దాల్చిన చెక్క, చిటికెటు నల్లమిరియాలు కలిపి తీసుకోవాలి.

ప్రతి రోజు డైట్ ను ఇలా ప్లాన్ చేసుకుంటే మలబద్దంకం సమస్యకు చెక్ పెట్టొచ్చని డైటీషియన్ మన్ ప్రీత్ కల్రా చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..