Stress: ఒత్తిడితో చిత్తవుతున్నారా.? చామంతి పూలతో ఇలా చేయండి..

|

Dec 02, 2023 | 9:31 PM

ఒత్తిడిని తగ్గించుకునేందుకు మానసిక నిపుణులు ఎన్నో సూచనలు చేస్తున్నారు. యోగా, మెడిటేషన్‌ మొదలు తీసుకునే ఆహారం వరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే ఒత్తిడిని తగ్గించేందుకు ఓ మంచి ఉపాయం ఉంది. చామంతి పూలతో తయారు చేసే టీ తాగడం వల్ల ఒత్తిడిని దూరం చేయొచ్చని మీకు తెలుసా.? అవును నిత్యం ఈ టీ తాగితో ఒత్తిడి బలదూర్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు...

Stress: ఒత్తిడితో చిత్తవుతున్నారా.? చామంతి పూలతో ఇలా చేయండి..
Chamanthi Tea Benefits
Follow us on

మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వర్క్‌ కల్చర్‌ కారణం ఏదైనా.. ఒత్తిడి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు శారీరక శ్రమతో కూడిన ఒత్తిడి ఉండేది. కానీ ఇప్పుడు మానసిక ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ఎన్నో రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి తీవ్రత కారణంగా శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో చాలా మంది మానసిక వైద్యులను సంప్రదిస్తున్నారు.

ఒత్తిడిని తగ్గించుకునేందుకు మానసిక నిపుణులు ఎన్నో సూచనలు చేస్తున్నారు. యోగా, మెడిటేషన్‌ మొదలు తీసుకునే ఆహారం వరకు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అయితే ఒత్తిడిని తగ్గించేందుకు ఓ మంచి ఉపాయం ఉంది. చామంతి పూలతో తయారు చేసే టీ తాగడం వల్ల ఒత్తిడిని దూరం చేయొచ్చని మీకు తెలుసా.? అవును నిత్యం ఈ టీ తాగితో ఒత్తిడి బలదూర్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

చామంతి పూలతో చేసిన టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పలు అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు ఈ టీని తాగితే నిద్ర పట్టడంలో ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీంతో ఒత్తిడి దూరమై, ప్రశాంతత లభిస్తుంది.

కెఫిన్‌ ఉన్న డ్రింక్స్‌తో పోల్చితే.. చామంతి టీ తాగడం వల్ల ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. నరాలను రిలాక్స్‌ చేయడంలో ఈ టీ కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. అలాగే చామంతి టీ మంచి పెయిన్‌ రిలీఫ్‌గా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆందోళ‌న, అల‌జ‌డిని మాయం చేస్తుంద‌ని, ద‌గ్గు, జ‌లుబుల‌ను ద‌రిచేర‌నివ్వ‌ద‌ని డైటీషియ‌న్లు చెబుతున్నారు. ఇక చామంతి టీతో జీర్ణ‌క్రియ కూడా మెరుగువుతంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..