దేశం, ప్రపంచంలో క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. చాలా రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. వీటిలో ఒకటి వెన్నుముక క్యాన్సర్. మీరు నిరంతరం వెన్నునొప్పితో బాధపడుతుంటే.. అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఈ పరిస్థితిలో మీరు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
వెన్నుముకలో కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభించినప్పుడు వెన్నుముక క్యాన్సర్ వస్తుందని ఆంకాలజిస్ట్ డాక్టర్ వినీత్ కుమార్ చెప్పారు. కొంతకాలం తర్వాత ఈ కణాలు కణితులుగా మారడం ప్రారంభిస్తాయన్నారు. వెన్నెముక క్యాన్సర్ జన్యుపరమైన కారణాల వల్ల కూడా రావొచ్చని పేర్కొన్నారు. క్యాన్సర్ కణజాలం కాలు ఎముకలు, తుంటి ఎముక, వెన్నుముకకు కూడా వ్యాపిస్తుంది. ఈ పరిస్థితిని సెకండరీ బోన్ క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ కేసులు చాలా అరుదుగా కనిపించినప్పటికీ, సమయానికి గుర్తించకపోతే ఇది ప్రాణాంతకం అవుతుంది.
అతిగా ధూమపానం చేసేవారు, మద్యం సేవించే వారు లేదా ఊబకాయంతో బాధపడుతున్న వారికి వెన్నెముక క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు. అదే విధంగా గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేసే వ్యక్తులు, వారి DNA లో కొంత లోపం ఉన్నవారికి క్యాన్సరు వచ్చే అవకాశముందన్నారు. ఎవరైనా వెన్ను నొప్పి, శరీరంలోని ఎముకలు బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలన్నారు.
Read Also.. Jaggery Effects on Health: చలికాలంలో బెల్లం ఆరోగ్యానికి హానీకరం.. ఇప్పుడే ఈ విషయాలు తెలుసుకోండి..!