Childhood Cancer: పిల్లల్లో పెరుగుతున్న క్యాన్సర్లు.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..

|

Feb 18, 2024 | 9:28 PM

నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి క్యాన్సర్. సంకేతాలు, అవగాహన, లక్షణాలను తెలుసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడొచ్చు. నివారణ, లక్షణాలపై ప్రాథమిక అవగాహన, సరైన చికిత్స రెండూ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుత జీవనశైలి కారణంగా పిల్లల్లో కూడా క్యాన్సర్‌ సంభవం పెరుగుతోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఒక నివేదికను ప్రచురించింది. లుకేమియా, బ్రెయిన్ క్యాన్సర్, లింఫోమాస్, ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమా వంటి క్యాన్సర్లు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపింది..

Childhood Cancer: పిల్లల్లో పెరుగుతున్న క్యాన్సర్లు.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..
Childhood Cancer
Follow us on

నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటి క్యాన్సర్. సంకేతాలు, అవగాహన, లక్షణాలను తెలుసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడొచ్చు. నివారణ, లక్షణాలపై ప్రాథమిక అవగాహన, సరైన చికిత్స రెండూ అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుత జీవనశైలి కారణంగా పిల్లల్లో కూడా క్యాన్సర్‌ సంభవం పెరుగుతోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఒక నివేదికను ప్రచురించింది. లుకేమియా, బ్రెయిన్ క్యాన్సర్, లింఫోమాస్, ట్యూమర్స్, న్యూరోబ్లాస్టోమా వంటి క్యాన్సర్లు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలిపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు మన కళ్ల ముందే వ్యాధితో విలవిలలాడిపోతుంటే చూసి తట్టుకోవడం అసాధ్యం. చికిత్స సమయంలో శరీరంపై కలిగించే తీవ్రమైన ప్రభావాలు, వాటి తాలూకు నొప్పులను పసి శరీరాలు తట్టుకోలేవు. సరైన అవగాహనతో మెదిలితే పసివాళ్లను ఈ మహమ్మారి నుంచి కాపాడవచ్చంటున్నారు నిపుణులు. నేటి కాలంలో ఆరోగ్య సమస్యలకు కొదువ లేదు. అందుకే శరీరంలో ఏదైనా సమస్య కనిపిస్తే, అది చిన్నదైనా సరై విస్మరించవద్దు. ముఖ్యంగా వేగంగా బరువు తగ్గడం, అప్పుడప్పుడు తలనొప్పి లేదా వికారం, కణితులు, అలసట.. వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ఐదు సంకేతాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అవేంటంటే..

వేగంగా బరువు తగ్గడం

సన్నగా లేదా బొద్దుగా ఎలా ఉన్న పిల్లలు ఒక్కసారిగా అసాధారణ రేటుతో బరువు తగ్గుతున్నట్లయితే వెంటనే జాగ్రత్తగా ఉండాలి. వేగంగా బరువు తగ్గడం అంటే శరీరంలో అంతర్గత సమస్య ఉందని అర్థం. బహుశా ఒక అవయవం సరిగ్గా పని చేయకపోవచ్చు. బరువు తగ్గడం అస్సలు మంచి సంకేతం కాదు. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించాలి.

నిత్యం తలనొప్పి, వాంతులు

ఈ రోజుల్లో ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని పనిచేస్తుంటాం. ల్యాప్‌టాప్, మొబైల్ స్క్రీన్‌ని నిరంతరం చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కంటి నొప్పి వాంతికి కూడా కారణమవుతుంది. పిల్లలు తలనొప్పిగా ఉందని, వికారంగా ఉందని చెప్పినా.. తరచూ వాంతులు చేసుకుంటుంటే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. క్యాన్సర్ మరొక లక్షణం శరీరంలో వాపు. కీళ్లు అకస్మాత్తుగా వాచినా, శరీరంలో ఏదైనా గ్రంథి వాచినా లేదా ఎక్కడైనా కణితి కనిపించినా ముందుగా వైద్యులను సంప్రదించాలి. తరువాత అవసరమైన పరీక్షలు చేయించాలి.

ఇవి కూడా చదవండి

అలసట

మీ చిన్నారి చిన్నపనికే అలసిపోతుందా? రోజంతా సోమరితనంగా ఉంటుందా? అయితే ఏమాత్రం ఆలస్యం చేయకండి. శరీరంలో ఏదైనా సమస్య ఉంటేనే ఇలా జరుగుతుంది. క్యాన్సర్ మాత్రమే కాదు, శరీరంలో విటమిన్లు, పోషకాహారలోపం వంటి సమస్యల వల్ల కూడా అలసట చుట్టుముడుతుంది. సాధారణంగా కనిపించే ఈ లక్షణాలను పిల్లలలో కనిపిస్తే విస్మరించవద్దు.

ప్రముఖ ఫిజిషియన్, కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ శంకర్ నాథ్‌ ఏం చెబుతున్నారంటే.. వ్యాధిని ముందస్తుగా గుర్తించడం వల్ల సగం ప్రమాదం తప్పుతుంది. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. పై లక్షణాలు కనిపిస్తే అవసరమైన అన్ని పరీక్షలు చేయించాలి. అంటే సాధారణ రక్త పరీక్ష (CBC), X- రే, USG వంటివి చేయించాలి. పిల్లలకి కడుపు ఉబ్బడం, ఎముకలు వాపు ఉన్నా నిర్లక్ష్యం తగదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. శరీరంపై కణితి వంటివి కనిపించినా వైద్యులు FNAC వంటి పరీక్షలను సిఫార్సు చేస్తారు. ఎంత కష్టమైనా ఈ పరీక్షలన్నింటినీ తప్పక చేయించాలని చెబుతున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.