Child Height: తల్లిదండ్రులు తమ పిల్లల అభివృద్ధి కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా 13 నుంచి 17 సంవత్సరాల వయస్సులో పిల్లల ఎత్తు వేగంగా పెరుగుతుంది. అయితే, కొందరు పిల్లల ఎదుగుదల క్షీణిస్తుంది. ఫలితంగా హైట్ తక్కువగా ఉంటుంది. అయితే, హైట్ పెరగకపోవడం వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. పోషకాహార లోపం, సరైన జీవనశైలి లేకపోవడం కూడా కారణం అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు చాలా మంది హైట్ పెరగడంలో సమస్య ఎదుర్కొంటారు. చాలా మంది అమ్మాయిలు ఎత్తు ఉండాలని ఆకాంక్షిస్తారు. తద్వారా ఆకర్షణీయంగా ఉంటారని వారి విశ్వాసం. ఈ క్రమంలోనే పొడవు పెరిగేందుకు రకరాల ప్రయత్నాలు చేస్తారు. మెడిసిన్స్ అనీ, ఏవేవో ఉపయోగిస్తారు. అయితే, సహజ సిద్ధంగానూ ఎత్తు పెరగవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. కొన్ని యోగాసనాలు చేయడం వలన ఎత్తు పెరగడంతో పాటు.. మంచి శరీరాకృతి వస్తుందని చెబుతున్నారు. మరి ఆ యోగాసానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సూర్య నమస్కారం..
యోగా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అందుకే.. భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగానూ ఎంతో గుర్తింపు ఉంది. ఎత్తు ఎదగని పిల్లలు యోగా సాధాన చేయాలని యోగా నిపుణులు సూచిస్తున్నారు. ఎత్తు పెరగాలనుకునే వారు.. ప్రతి రోజూ సూర్య నమస్కారం చేయాలి. ఎత్తు వేగంగా పెరుగుతారు. ఈ యోగా చేయడం వల్ల కీలకమైన హార్మోన్లు యాక్టీవ్‌గా పని చేస్తాయి. ఇది ఎత్తు పెరగడానికి ఉపకరిస్తుంది.
తడసానా..
ఈ యోగా చేయడం చాలా సులభం. ఈ ఆసనం చేయడం వల్ల కండరాలు సాగడంతో పాటు ఎత్తు పెరుగుతారు. ఈ ఆసనాన్ని ఉదయం సమయంలో చేయడం ఉత్తమం. అయితే, ఉదయం కుదరకపోతే ఎప్పుడైనా చేయొచ్చు. ఈ ఆసనం చేయడం వలన కొన్ని నెలల్లోనే ఎత్తు పెరగడం మొదలవుతుంది.
వృక్షాసనం..
ఎత్తు పెంచే ఆసనాలలో వృక్షాసనం కూడా చాలా ముఖ్యమైనది. నిపుణుల ప్రకారం, ఈ ఆసనం ఎత్తును పెంచే హార్మోన్ల అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ ఆసనాన్ని 2 లేదా 3 సెట్లలో రోజుకు ఒకసారి చేయాలి. దీనిని వేయడం వలన వేగంగా ఎత్తు పెరగడం మొదలవుతుంది.
(గమనిక: యోగా నిపుణులు తెలిపిన సమాచారం మేరకు ఈ కథనాన్ని అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడంలేదు. ఎత్తు విషయంలో ఏవైనా సందేహాలుంటే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..