చలికాలం ఊపిరితిత్తులు జాగ్రత్త..! దగ్గుతో పాటు ఈ లక్షణాలు ఉన్నాయా..?

|

Oct 23, 2021 | 4:25 PM

Lungs: మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే అది బ్రోన్కైటిస్ సమస్య కావచ్చు. రానున్న

చలికాలం ఊపిరితిత్తులు జాగ్రత్త..! దగ్గుతో పాటు ఈ లక్షణాలు ఉన్నాయా..?
Lungs Infection
Follow us on

Lungs: మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే అది బ్రోన్కైటిస్ సమస్య కావచ్చు. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరగడంతోపాటు కాలుష్య స్థాయి కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలా మందికి బ్రాంకైటిస్ సమస్య ఉండవచ్చు. కానీ అంత తొందరగా బయటపడదు. అందుకే ప్రజలు తమను తాము రక్షించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సలహాలు కచ్చితంగా పాటించాలి.

శ్వాసకోశంలో మంట, ఇన్ఫెక్షన్ కారణంగా బ్రోన్కైటిస్ వ్యాధి సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటే వారు దీని బారిన పడుతారు. ఎక్కువ మురికి ప్రదేశాలలో నివసించే ప్రజలు, ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బ్రోన్కైటిస్ నయం కావడానికి రెండు వారాల సమయం పట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ వ్యాధిలో దగ్గు ఎక్కువగా వస్తుంది. ఇది నెలల తరబడి ఉండే అవకాశం ఉంది. తొలినాళ్లలో లక్షణాలు గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు.

ఇవి లక్షణాలు
శరీర నొప్పితో పాటు దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్లేష్మంతో కూడిన దగ్గు, రాత్రి పడుకునేటప్పుడు ఛాతి నుంచి ఊపిరి పీల్చుకుంటే శబ్దాలు రావడం బ్రాంకైటిస్ లక్షణాలు

ఈ జాగ్రత్తలు తీసుకోండి
బ్రోన్కైటిస్ నివారించడానికి ప్రజలు దుమ్ము, కాలుష్యం, పొగ నుంచి తమను తాము రక్షించుకోవాలి. ధూమపానం చేసే వ్యక్తులు ఎక్కువగా దీని బారిన పడుతారు. ఊపిరితిత్తులకు నష్టం కలిగించే ఏ పని చేయవద్దు. మీ కుటుంబం లేదా మీ చుట్టూ ఉన్నవారికి శ్వాసకోశ వ్యాధి ఉంటే వారి నుంచి దూరంగా ఉంటే మంచిది. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బయటకు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ మాస్క్ ధరించడానికి ప్రయత్నించాలి. బైక్ నడుపుతుంటే వెచ్చని వస్త్రాన్ని కట్టుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

Protein Shake: డబ్బు ఖర్చు కాకుండా ఇంట్లోనే ప్రొటీన్‌ షేక్ తయారు చేయండి..! చాలా సులువు..

Surekha Vani: కూతురుతో కలిసి సురేఖ వాణి ఫాస్ట్‌ బీట్‌ స్టెప్పులు…చూస్తే అదిరిపోవాల్సిందే..

Rashmika Mandanna: అంత కోపం ఎందుకమ్మా శ్రీవల్లి.. కిక్ బ్యాగ్‌ను కసిగా తంతున్న రష్మిక.. వీడియో వైరల్..