
మారుతున్న సీజన్‌లో చాలా వ్యాధులు మనల్ని చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం చివర్లో.. శీతాకాలం ప్రారంభంలో మన చుట్టూ చాలా ప్రమాదకరమైన వ్యాధులు ప్రభలుతుంటాయి. వాతావరణం మారినప్పుడు లేదా.. మారుతున్నప్పుడు ఈ వ్యాధులు మరింత చురుకుగా మారతాయి. ముఖ్యంగా శీతాకాలం ప్రారంభంలో ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. అందులో కీళ్ల నొప్పుల సమస్య ఒకటి. ఇంట్లోని వృద్ధులు, మహిళలు, యువకులు కూడా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడటం మీరు చూసే ఉంటారు. వాతావరణం మారినప్పుడల్లా జలుబు, దగ్గు, జ్వరంతోపాటు కీళ్ల నొప్పుల సమస్య పెరుగుతుంది.
కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? కీళ్ల నొప్పులకు కారణం ఏంటంటే..?
కీళ్లలో నొప్పి ఎందుకు వస్తుందో చాలామందికి అర్థం కాదు.. దీనికి సంబంధించి దేశంలోని ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు.. మోకాళ్లు, కీళ్ల నొప్పుల వెనుక అనేక కారణాలు ఉంటాయని చెబుతున్నారు. వీటిలో గాయం లేదా వైద్యపరమైన కారణాలైన హైపర్సెన్సిటివిటీ, స్ట్రెస్ లేదా జాయింట్‌కి డైరెక్ట్ ట్రామా, సరిగ్గా నయం కాని కీళ్ల పగుళ్లు, కీళ్లకు సంబంధించిన స్నాయువులో మంట, చికాకు, అలాగే చికిత్సలో ఉన్న ఏదైనా ఇతర వ్యాధి లాంటి కారణాలు.. నొప్పులకు దారి తీస్తాయి.
ఇది కూడా కీళ్ల నొప్పులకు కారణం..
ఆర్థరైటిస్ సమస్య కారణంగా మీ మోకాళ్లలో, కీళ్లలో వాపు కనిపించడం నుంచి ప్రారంభమవుతుంది. ఈ వాపు కారణంగా నొప్పి సమస్య, మోకాళ్లు, కీళ్లలో దృఢత్వం తగ్గిపోవడం కనిపిస్తుంది. అలాగే వాపు సమస్య పెరిగేకొద్దీ మీరు నడవడానికి లేదా కదలడానికి ఇబ్బంది పడతారు.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనానికి నివారణలు..
చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఒక వెచ్చని వస్త్రం సహాయంతో బాధాకరమైన నొప్పి ప్రాంతాన్ని కాపడం చేయాలి. ఇది కాకుండా శీతాకాలంలో వెచ్చని దుస్తులు ధరించండి. దీని నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.
శారీరక శ్రమ అవసరం..
కీళ్లలో నొప్పి ఉంటే.. శారీరక శ్రమ చేయకూడదని కాదు. మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడానికి చాలా దూరం నడవవచ్చు. కొంచెం వ్యాయామం కూడా చేయవచ్చు.. ఇలా చేయకపోతే.. ప్రతిరోజూ మీ చేతులు, కాళ్ళను తేలికగా కదిలిస్తూ ఉండాలి. దీంతో కొంచెం రిలీఫ్ కూడా దొరుకుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి..
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీని కోసం ఆలివ్ నూనె, పండ్లు, కూరగాయలు తీసుకోవచ్చు. మాంసాహారులు అయితే మీరు చేపలను కూడా తినవచ్చు.
కాల్షియం – విటమిన్ డి అవసరం..
కాల్షియం, విటమిన్-డి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. అదే సమయంలో విటమిన్-డి కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో బాగా సహాయపడుతుంది. కావున ప్రతిరోజూ కాసేపు ఎండలో కూర్చోవాలి.. ఎందుకంటే సూర్యరశ్మి వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి