AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లివర్ సమస్యలున్న వారు పసుపు తినొచ్చా..? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది..

మన శరీరానికి కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం.. ఇది శరీరంలోని అనేక ముఖ్యమైన విధులకు సహాయపడుతుంది. కాలేయ వ్యాధులు ఉన్న రోగులు తమ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో వారు పసుపు తినాలా..? వద్దా..? అనే సందేహం వ్యక్తమవుతుంది. ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

లివర్ సమస్యలున్న వారు పసుపు తినొచ్చా..? ఒకవేళ తింటే ఏం జరుగుతుంది..
Turmeric-Liver Health
Shaik Madar Saheb
|

Updated on: Sep 03, 2025 | 3:22 PM

Share

కాలేయం మన శరీరంలోని అతిపెద్ద అంతర్గత అవయవం.. ఇది అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఇది శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.. శక్తిని ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది. ఇది రక్త పరిమాణం, ప్రోటీన్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. కాలేయం దెబ్బతినడం అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. అధికంగా మద్యం సేవించడం, జంక్ ఫుడ్, నూనె – కారంగా ఉండే ఆహారం, ఊబకాయం, హెపటైటిస్ వైరస్, దీర్ఘకాలిక మందుల వాడకం, హార్మోన్ల అసమతుల్యత అన్నీ కూడా కాలేయ సమస్యలను పెంచుతాయి. దీనితో పాటు, తగినంత నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి తప్పుడు జీవనశైలి అలవాట్లు కూడా కాలేయాన్ని బలహీనపరుస్తాయి. కాలేయం సరైన జాగ్రత్త తీసుకోకపోతే, ఈ అవయవం క్రమంగా ప్రభావితమవుతుంది.. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి అత్యవసర పరిస్థితికి కూడా దారితీయొచ్చు..

కాలేయం దెబ్బతినడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయి. అత్యంత సాధారణ సమస్యలు ఫ్యాటీ లివర్, కామెర్లు, హెపటైటిస్, సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్.. ఫ్యాటీ లివర్‌లో, లివర్ కణాలలో కొవ్వు పేరుకుపోతుంది.. ఇది దాని పనితీరును ప్రభావితం చేస్తుంది. హెపటైటిస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కాలేయానికి వాపు, నష్టం కలిగిస్తుంది. లివర్ సిర్రోసిస్‌లో, ఆరోగ్యకరమైన కణాలు ప్రభావితమవుతాయి. ఈ వ్యాధులు అలసట, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, చర్మం – కళ్ళు పసుపు రంగులోకి మారడం, వాపు, జీర్ణ సమస్యలు వంటి సమస్యలను కలిగిస్తాయి. తీవ్రమైన లివర్ దెబ్బతిన్న సందర్భంలో, శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోతాయి. ఇది మెదడు – ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో లివర్ రోగులు పసుపు తినొచ్చా..? లేదా..? నిపుణులు ఏం చెబుతున్నారు.. లాంటి విషయాలను ఈ కథనంలో తెలుసుకోండి..

కాలేయ వ్యాధులలో పసుపు తినొచ్చా..?

ఢిల్లీలోని RML హాస్పిటల్‌లోని మెడిసిన్ విభాగంలో HOD ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ గిరి వివరిస్తూ, పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుందని, ఇది వాపును తగ్గిస్తుందని – యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని వివరించారు. పసుపు వినియోగం కొంతవరకు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, సిర్రోసిస్, హెపటైటిస్ లేదా కాలేయ వైఫల్యం వంటి తీవ్రమైన కాలేయ వ్యాధులలో పసుపును అధికంగా తీసుకోవడం హానికరం.. అందువల్ల, పసుపును తక్కువ పరిమాణంలో ఆహారంలో చేర్చడం సురక్షితమని భావిస్తారు.. ఇంకా పాలలో చిటికెడు పసుపు లేదా కూరగాయలలో పసుపు జోడించడం వంటివి చేస్తారు.. అయితే.. దీనిని పెద్ద పరిమాణంలో తీసుకోవడం లేదా సప్లిమెంట్ల రూపంలో తీసుకోకుండా ఉండడం మంచిది.. దీనిని ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలోనే తీసుకోండి..

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యమని డాక్టర్ సుభాష్ అంటున్నారు. ఆకుకూరలు, ఓట్ మీల్, బార్లీ, బ్రౌన్ రైస్, పండ్లు వంటి సహజ ఫైబర్స్ అధికంగా ఉండే ఆహారాలు కాలేయాన్ని శుభ్రపరచడానికి.. మంచిగా పనిచేయడానికి సహాయపడతాయి. గుడ్లు, చేపలు, వేరుశెనగలు, పప్పుధాన్యాలు ప్రోటీన్ కు మంచి మూలం.. ఇది కాలేయాన్ని బలపరుస్తుంది. దీనితో పాటు, ఆల్కహాల్ – నూనె పదార్థాలను నివారించండి.. పుష్కలంగా తగినంత నీరు త్రాగండి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి..

పసుపును పరిమిత పరిమాణంలో మాత్రమే తినండి.

పసుపు సప్లిమెంట్లు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి.

ఆల్కహాల్ – నూనె పదార్ధాలకు దూరంగా ఉండండి.

ఆరోగ్యకరమైన – పోషకమైన ఆహారం తీసుకోండి.

తగినంత నీరు త్రాగండి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉండండి..

మీ దినచర్యలో వ్యాయామం – యోగాను చేర్చుకోండి.

వీలైనప్పుడల్లా నడవండి.. నడక ఆరోగ్యానికి చాలా మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..